ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి భార్య ముక్కు కోసి.. జేబులో వేసుకుని పరారయ్యాడు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రియురాలి మోజులో పడిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య మొక్కుకోసాడు. ఆ తర్వాత.. కోసిన ముక్కును జేబులో వేసుకుని పరారయ్యాడు. అనుకోని ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయిన భార్య… లబోదిబోమంటూ.. రక్తం కారుతున్న ముక్కుతోనే పోలీస్ స్టేషన్కు చేరుకుంది. భర్త చేసిన పనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి…

ఉత్తరప్రదేశ్లోని లఖీంపూరి ఖేరీకి చెందిన ఓ వ్యక్తికి పెళ్లయింది. ఆ తర్వాత మరో మహిళ మీద మోజుపడ్డాడు. సదరు ప్రియురాలి కోసం భార్య ముక్కు పదునైన ఆయుధంతో కోసేశాడు. ఆ తర్వాత ఆ ముక్కును జేబులో వేసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ముక్కు కోసేయడంతో రక్తం కారుతుంటే అలాగే పోలీస్ స్టేషన్కు చేరుకుంది భార్య. భర్త చేసిన పని మీద ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు భర్తను వెతికి పట్టుకున్నారు.

తల్లితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. ఆమె కూతురిపై రాడ్డుతో దాడి...

నిందితుడి పేరు విక్రమ్. బాంస్తాలి గ్రామం. బాధితురాలైన అతని భార్య పేరు సీమాదేవి. ఆమెది మొహమదాబాద్ గ్రామం. కొన్నాళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది కాలం క్రితం విక్రం గ్రామంలోని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య సీమాదేవికి తెలిసింది. దీంతో తరచుగా భర్తతో గొడవ పడుతుండేది.

దీనిమీద సీమాదేవి మాట్లాడుతూ… ప్రతిరోజూ రాత్రి భోజనాలైన తర్వాత ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండదని తెలిపింది. ఆరోజు కూడా రాత్రి భోజనం చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఇదే విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో విక్రమ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కూతురుపై తన కోపాన్ని చూపించాడు. భార్య సీమా దేవి అడ్డుకోవడంతో… పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసేశాడు. ఆ తర్వాత దాన్ని జేబులో వేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు.

ఓవైపు ముక్కు కోసిన బాధ మరోవైపు భర్త పారిపోవడం ఏం చేయాలో అర్థం కాని సీమ వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అక్కడ ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ తరువాత ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విక్రమ్ ను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.