ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పేరు  తలచుకుంటేనే సామాన్యుడు వణికిపోతున్నాడు. ఈ వైరస్‌కు ముందు త్వరగా వచ్చి తమను కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా కరోనాకు పూజలు చేస్తున్నాడు.

కేరళలోని కడక్కల్‌కు చెందిన అనిలన్ థర్మకోల్‌తో తయారు చేసిన కరోనా వైరస్ చిత్రాన్ని పూజిస్తున్నాడు. ప్రతి నిత్యం ధూప, దీప నైవేద్యాలతో అర్చిస్తూ.. కోవిడ్‌ 19పై పోరులో ముందుండే డాక్టర్లు, పోలీసులు, మీడియా సిబ్బందితో  పాటు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల కరుణ చూపాలని అనిలన్ కరోనాను వేడుకుంటున్నాడు.

Aslo Read:ఢిల్లీలో కరోనా రోగులకు 500 ట్రైన్ కోచ్‌లు, టెస్టులను మూడింతల పెంపు: అమిత్ షా

అతని పూజలకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో... పబ్లిసిటీ కోసమే అనిలన్ డ్రామాలు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే మూఢభక్తి ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు.

మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారని కేరళకు చెందిన ప్రముఖ రచయిత, విమర్శకుడు సునీల్ పి ఎలాయిడోమ్ కామెంట్ చేశాడు. దీనిపై అనిలన్ స్పందిస్తూ... తనపై వస్తున్న ట్రోలింగ్‌ను ఎప్పుడూ పట్టించుకోలేదని పేర్కొన్నాడు.

కరోనా దేవి పూజతో తాను ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నానని చెప్పాడు. 33 కోట్ల మంది హిందూ దేవతల్లో కరోనా దేవి కూడా ఒకరని... నచ్చిన దైవాన్ని పూజించడం తన హక్కని అనిలన్ స్పష్టం చేశాడు.

Also Read:ఇండియాపై కరోనా పంజా:కోవిడ్ మరణాలలో టాప్‌టెన్‌లో భారత్‌కి చోటు

తన ఇంట్లో కరోనా దేవికి పూజలు చేసేందుకు ఇతరులకు అనుమతి లేదని అన్నాడు. ఇదే సమయంలో భారత్‌లో అన్‌లాక్-1 పేరుతో దేవాలయాలు తెరవడం మంచిది కాదని అతను అభిప్రాయపడ్డాడు.

కరోనా వ్యాప్తికి మనమే  ద్వారాలు  తెరిచామని అనిలన్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఇతని కంటే ముందు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో కూడా పలువురు కరోనా దేవికి పూజలు చేసిన సంగతి తెలిసిందే.