Asianet News TeluguAsianet News Telugu

‘నా వల్ల ఆమె బాధపడకూడదు’.. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ లో యువకుడి ఆత్మహత్య..

ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన అస్సాంలో కలకలం రేపింది. పెద్దల ఒత్తిడివల్లే నిరాకరించిందని.. తన వల్ల ఆమె బాధపడకూడదంటూ ఈ దారుణానికి తెగించాడు.

man committed suicide in facebook live in guwahati
Author
First Published Dec 31, 2022, 7:02 AM IST

గువాహటి : ప్రేమించుకోవడం వరకు ఓకే పెళ్లి చేసుకోవడానికి వచ్చేసరికే అభ్యంతరాలు ఎదురవుతుంటాయి. పెద్దలు ఒప్పుకోకపోవడం.. ప్రేమికులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం.. లేదంటే ఎదిరించి పెళ్లి చేసుకోవడం మామూలు విషయమే. అలాగే ఓ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. జీవిత ప్రయాణం అంతా ఇద్దరూ కలిసి సంతోషంగా గడపాలని అనుకున్నారు. అయితే వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగానే యువతి కుటుంబీకులు ససేమిరా  అన్నారు. ఆ యువకుడిని పెళ్లి చేసుకోవద్దని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో మామూలుగానే యువతి పెళ్లికి ఒప్పుకోలేదు.పెళ్లివరకు వచ్చేసరికి యువతి హ్యాండ్ ఇవ్వడంతో యువకుడు మనస్తాపం చెందాడు.. 

ఫేస్బుక్లో తన వేదనను వెళ్లగక్కడానికి లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. ఆ లైవ్ స్ట్రీమ్ లోనే ఉరివేసుకున్నాడు. లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వారంతా ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ అయ్యారు. సోమవారం అస్సాంలో ఈ ఘటన జరిగింది. ఇంత జరిగినా యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం  ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించ లేదు.  అయితే, దీనిమీద యువకుడి బంధువులు మాత్రం అతను ఆత్మహత్య చేసుకోవడానికి యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడమే కారణమని  ఆరోపిస్తున్నారు. ఈ షాపింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… జయదీప్  అనే ఆ యువకుడు అస్సాంలోని కలాయిన్ నివాసి. మెడికల్ సైన్స్ ప్రొఫెషనల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గువాహటిలోని సిల్చార్ లో అద్దెగదిలో ఉంటున్నాడు.  అదేగదిలో లైవ్ స్ట్రీమ్ పెట్టి  ఆత్మహత్య చేసుకున్నాడు.

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల మోత.. జిమ్ యజమాని హతం.. దుండగుల కోసం గాలింపు..

‘నేను ఆ యువతిని ఎంతగానో ప్రేమించాను..ఆమె లేకుండా నేను బతకలేను. అందుకే పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. కానీ, అందరూ చూస్తుండగానే నా ప్రపోజల్ ను తిరస్కరించింది. ఆ తర్వాత ఆమెకు అంకుల్ వరసయ్యే ఓ వ్యక్తి వచ్చి… నన్ను బెదిరించాడు. ఆమెతో ప్రేమ పెళ్లి అంటే ఇలాగే తిరుగుతూ ఉంటే.. ఆమెను చంపేస్తామని  హెచ్చరించారు. అందుకే నాకు చచ్చిపోవాలని ఉంది. నావల్ల నేను ఎంతగానో ప్రేమించిన ఆమె ఎలాంటి బాధా పడకూడదు. అమ్మా నన్ను క్షమించు..  అక్క, బావ, తమ్ముడు, అంకుల్, ఆంటీ.. మీరందరూ అంటే నాకు ఎంతో ఇష్టం.  మీ అందరికంటే ఆ అమ్మాయి అంటే అంతకు మించిన ప్రేమ. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. అందుకే ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను’ అంటూ జయ్ దీప్ లైవ్ స్ట్రీం వీడియోలో తన బాధను వ్యక్తం చేస్తూ సూసైడ్  చేసుకున్నాడు. 

చాలా కాలంగా ఇద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నామని ఒక్కసారిగా ఆమె నో చెప్పడంతో తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. జయదీప్ మరణవార్త విన్న కుటుంబం షాక్ అయిందని తమ్ముడు రూపమ్ రే తెలిపాడు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అతను చెప్పుకొచ్చాడు. యువతి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే తన అన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నాడు. ‘మా అన్నయ్య  బాగా సంపాదిస్తాడు. మా కుటుంబాన్నంతా ఆయనే పోషిస్తాడు. ఎంతో మంచివాడు కూడా.  అంత మంచి వ్యక్తితో పెళ్లికి యువతి బంధువులు ఎందుకు అభ్యంతరం చెప్పారో, ఎందుకు వద్దన్నారో తెలియడం లేదు’ అని తమ్ముడు అన్నాడు. దీని మీద పోలీసు అధికారి నుమల్ మహంతా మాట్లాడుతూ మృతుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అయితే తమకు అందిన సమాచారంతో దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios