Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల మోత.. జిమ్ యజమాని హతం.. దుండగుల కోసం గాలింపు..

దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ జిమ్ యజమాని హత్యకు గురయ్యాడు. తూర్పు ఢిల్లీలో ఉన్న ఎనర్జీ జిమ్ యజమాని మహేంద్ర అగర్వాల్ పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒక్క బుల్లెట్ అతని తలకు తాకడంతో అక్కడిక్కడికే మరణించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది.

Delhi Gym Owner Shot Dead In Office, Killers Take Away CCTV Recorder
Author
First Published Dec 31, 2022, 1:58 AM IST

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతం శుక్రవారం సాయంత్రం కాల్పుల మోతతో మారుమోగింది. బైక్‌పై వచ్చిన ముసుగు దుండగులు ఎనర్జీ జిమ్ యజమాని మహేంద్ర అగర్వాల్ (40)ని కాల్చి చంపారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు కార్యాలయంలోకి చొరబడి వ్యాపారవేత్తపై నాలుగు బుల్లెట్లు కాల్చారు. హత్య చేసిన అనంతరం నిందితులు పరారీలో ఉన్నారు. వ్యాపారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. శత్రుత్వమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తెలిపింది. సీసీటీవీ పుటేజీల ఆధారంగా ఇద్దరు దుండగులను గుర్తించారు. పోలీసులు గుర్తింపులో నిమగ్నమై ఉన్నారు.
 
జిమ్ యజమాని మహేంద్ర అగర్వాల్.. తన కుటుంబంతో కలిసి పట్పర్‌గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతనికి భార్య, 18 ఏళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మహేంద్ర అగర్వాల్ కు ప్రీత్ విహార్‌లో ఎనర్జీ అనే జిమ్ ఉంది. దీనితో పాటు జిమ్ మెషిన్ల తయారీ వ్యాపారం కూడా నిర్వస్తున్నారు. అతని కార్యాలయం ప్రీత్ విహార్‌లోని జిమ్‌పై అంతస్తులో ఉంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆయన తన కార్యాలయంలో పనిచేస్తుండగా.. ఆకస్మత్తుగా ముగ్గురు దుండగులు చొరబడ్డారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు అతని కార్యాలయానికి వెళ్లగా, మూడవ దుండగుడు బైక్ దగ్గర తన సహచరుల కోసం వేచి ఉన్నాడు. దాదాపు పది నిమిషాల పాటు ఘర్షణ జరిగింది.దుండగులు మహేంద్ర అగర్వాల్‌పై అతి సమీపం నుంచి నాలుగుసార్లు కాల్చారు. దుండగులు అతని తలతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై కాల్చారు.

నేరం చేసిన తర్వాత దుండగులంతా అక్కడి నుంచి పారిపోయారు. తుపాకీ కాల్పుల శబ్దం విని, జిమ్‌లో ఉన్న వ్యక్తులు మేడపైకి చేరుకున్నారు, అక్కడ జిమ్ యజమాని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినప్పటికీ, వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే పరస్పర శత్రుత్వం లేదా బలవంతపు వసూళ్ల కారణంగా ఆయన హత్యకు గురయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios