టిక్ టాక్ పిచ్చి అందరికీ ఎక్కేస్తోంది. నిన్న, మొన్నటి వరకు యూత్ మాత్రమే దీని మాయలో పడేవారు. ఇప్పుడు... ఈ పిచ్చి అందరికీ ఎక్కేసింది. దీని మాయలో పడి ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, బిడ్డలను వదిలేసాడు. అందులో పరిచయం అయిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read మాట్లాడటం లేదని... ప్రియురాలి నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెట్టి.....

పూర్తి వివరాల్లోకి వెళితే..... తమిళనాడు రాష్ట్రం అన్నానగర్ సమీపంలోని మేల్ ఇరుప్పు వీధికి చెందిన రాజశేఖర్(26) కి ఆరు సంవత్సరాల క్రితం సుకన్య(25) తో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. సుకన్య ప్రస్తుతం కొల్లుకారన్ కుటైలోని ప్రైవేటు కళాశాలలో బీఎడ్ చదువుతోంది. కాగా.... రాజశేఖర్ మొదటి నుంచి పలువురు మహిళలలో వివాహేతర సంబంధం ఉంది.

ఈ విషయంపై పలుమార్లు బాధిత మహిళ భర్తతో గొడవ పడింది. అయితే గొడవ పడిన ప్రతిసారీ.. భర్త, అత్తమామ, ఆడబిడ్డ తనను శారీరకంగా, మానసికంగా వేధించేవారని ఆమె తెలిపింది. తాజాగా... తన భర్త టిక్ టాక్ లో పరిచయం అయిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు తెలిపింది. దీనిపై కూడా తాను ప్రశ్నించానని దీంతో.. తనని కాదని ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.