ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. దీంతో.. అతని ప్రేమను ఆమె అంగీకరించింది. అయితే... వారి కులాలు వేరు కావడంతో పెద్దలు నిరాకరించారు. ఇంట్లో వారు అభ్యంతరం తెలిపడంతో అతనిని కొద్ది రోజులు దూరం పెట్టేసింది. తన ప్రేమను దూరం పెట్టేసిందని ఆమెపై అతను కోపం పెంచుకున్నాడు. వెంటనే ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా గండాచ్చిపురానికి చెందిన కలైయరసన్‌ (24) వండిపాళ్యంలో బంధువు ఇంట్లో ఉంటూ కడలూరులోని సెల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాపులో పనిచేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ చనువుగా కూడా మెలిగేవారు. అయితే... వీరిద్దరి కులాలు వేరు వేరు కావడంతో యువతి ఇంట్లో అభ్యంతరం తెలిపారు.

Also Read అత్యాచారం చేశాడన్న మహిళ.. నిజమే కానీ నిర్దోషంటున్న కోర్టు..


 దీంతో యువతి కలైయరసన్‌తో మాట్లాడడం ఆపేసింది. దీంతో ఆగ్రహించిన కలైయరసన్‌ యువతి తనకు పంపిన నగ్నచిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కడలూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి కలైయరసన్‌ను అరెస్టు చేశారు. అతని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను బ్లాక్  చేశారు.