బాంబులతో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్.. ఢిల్లీలో హైఅలర్ట్

Man caught with bombs on bus to Delhi
Highlights

మరి కొద్దిరోజుల్లో జరగున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ రెడీ అవుతోంది. ఎర్రకోట, ఇండియాగేట్, రాజ్‌పథ్ మార్గంలో కనీవీని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 

మరి కొద్దిరోజుల్లో జరగున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ రెడీ అవుతోంది. ఎర్రకోట, ఇండియాగేట్, రాజ్‌పథ్ మార్గంలో కనీవీని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అయితే ఇండిపెండెన్స్ డే వేడుకలను టార్గెట్ చేసిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ.. భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.

దేశంలో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్ర రాజధానుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో దేశరాజధానిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లే బస్సులో బాంబులను తీసుకు వెళుతున్నట్లు సమాచారం అందడంతో బైక్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని దగ్గరి నుంచి బాంబులు స్వాధీనం చేసుకున్నారు. 
 

loader