Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. పావురాలు కొనడానికి వచ్చి పొడిచి, పారిపోయాడు..

రాత్రిపూట పావురాలు కొనడానికి వచ్చిన ఓ వ్యక్తి అక్కడున్న ఏడుగురిని కత్తితో పొడిచాడు. చిన్న విషయంతో కోపోద్రిక్తుడై ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

man came to buy pigeons, stabbed 7 people in karnataka
Author
First Published Nov 10, 2022, 10:36 AM IST

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పావురాలు కొనడానికి వచ్చిన ఒక వ్యక్తి ఒకే కుటుంబంలోని ఏడుగురిని కత్తితో పొడిచి, తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన కోలారు జిల్లా మాలూరు పట్టణంలోని పటాలమ్మ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీలో నివాసముంటున్న రాము, భార్య హేమావతి, నాగవేణి,  రాజేశ్వరి, రూప, నాగరాజ్, మరొకరు ఈ దాడిలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నాగరాజు తమ్ముడు రాము పటాలమ్మ కాలనీలో పావురాల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పావురాలు  కొనడానికి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే బాగా చీకటి పడిపోవడం,  ఇమ్రాన్ ఖాన్ ఫఉల్లుగా మద్యం తాగి ఉండడం చూసిన నాగరాజు కాస్త అనుమానించాడు.  పావురాలు కొనడానికి రాత్రి సమయంలో ఎందుకు వచ్చావు అని ఇమ్రాన్ ఖాన్ ను అడిగాడు.  

కోయంబత్తూరు కారు పేలుడు కేసు.. ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం.. తమిళనాడులో 45 చోట్ల సోదాలు..

దీంతో ఇమ్రాన్ ఖాన్  కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే ఇమ్రాన్ ఖాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసి ఏడుగురిని గాయపరిచాడు. ఈ హఠాత్రరిణామానికి షాక్ అయిన వారు.. గట్టిగా కేకలు వేడంతో.. చుట్టుపక్కల వారు వచ్చి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మాలూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. దాడి వెనక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఇదిలా ఉండగా, మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి, ఆమెను సజీవంగా పూడ్చేసిన ఓ కుమారుడి ఉదంతం తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని చిట్టాపూర్ లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిత్తామూరుకు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  గొడవల కారణంగా అతని భార్య పిల్లలతో సహా పుట్టింట్లో  ఉంటుంది. ప్రస్తుతం అతను తల్లి యశోదతో  కలిసి జీవిస్తున్నాడు. తండ్రి పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. నిత్యం మద్యం తాగే అలవాటు ఉన్న శక్తివేల్.. తరచూ తల్లితో గొడవ పడేవాడు.

దీంతో భయంతో ఆమె రాత్రివేళల్లో ఎదురింట్లో నిద్రించేది. మంగళవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన శక్తివేల్ తల్లితో మరోసారి గొడవపడ్డాడు తర్వాత యశోద కనిపించలేదు. ఇరుగు పొరుగువారు ఆమె కోసం గాలించారు. శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండటంతో.. వెనక్కి వెళ్లి పరిశీలించగా.. యశోద చీర కింద పడి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలే ఉన్న శక్తివేల్ వారిని చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనికి స్థానికులు దేహశుద్ధి చేయగా, తన తల్లిపై తల్లిపై దాడి చేయడంతో ఆమెతలకు గాయమై, స్పృహ తప్పి పడిపోయిందని తెలిపాడు. వెంటనే ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు వెల్లడించాడు. పోలీసులు వచ్చి గొయ్యిని తెరిచేలోగానే ఆమె ప్రాణాలు విడిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios