బెంగళూరులో ఓ ప్రేమికుడు దారుణానికి తెగబడ్డాడు. యేళ్ల తరబడి ప్రేమించుకోవడానికి అడ్డురాని కులం పెళ్లి చేసుకుందాం అనేసరికి గుర్తుకువచ్చింది. అంతే ప్రియురాలు వినేలా లేదని ప్రాణంగా ప్రేమించానని చెప్పిన అతనే పెట్రోల్ పోసి కాల్చేశాడు. 

బెంగళూరు : మూడుముళ్ల బంధం కావాలని ఆమె కోరినందుకు అప్పటివరకు ప్రాణంగా చూసుకుంటానని హామీలు గుప్పించిన lover రగిలిపోయాడు. ఆమెపై నిప్పులు చెరిగాడు. అతడి కర్కశానికి కాలిన గాయాల పాలై మృత్యువుతో పోరాడి దానేశ్వరి అనే యువతి చివరికి కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన Bangaloreలోని Electronic City ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు శివకుమార్ పరారయ్యాడు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే…

విజయపురి జిల్లాకు చెందిన దానేశ్వరి, శివ కుమార్ ఇంజనీరింగ్ చదివే సమయంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చదువులు పూర్తయ్యాక ఉపాధి కోసం బెంగళూరు చేరుకున్నారు. నగరంలోని వేర్వేరు కంపెనీల్లో వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక ప్రేమకు స్వస్తి చెప్పి Marriageచేసుకుందామని దానేశ్వరి తన ప్రియుడిపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ మాట వినగానే అప్పటివరకు ప్రేమను కొనసాగించిన శివకుమార్ ఆలోచనల్లో, మాటల్లో మార్పులు వస్తాయి. తాము వివాహం చేసుకోవడం సాధ్యంకాదని.. తామిద్దరివీ వేర్వేరు కులాలవ్వడమే కారణమని తెగేసి చెప్పాడట. ఈ విషయమై మరింత ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించాలని ఆమె ఎంతగానో ప్రయత్నించిందని బంధువులు వివరించారు. 

ఇందులో భాగంగానే శివకుమార్ పనిచేసే ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలోని వీరసంద్రలోని సంస్థ వద్దకు బుధవారం ఆమె వెళ్ళి ప్రశ్నించినట్లు తెలిపారు. ఇందుకోసమే ఎదురు చూస్తున్న శివకుమార్ ఆమెతో మాట్లాడుతూ ఓ చోటకి తీసుకెళ్ళి తన వెంట తెచ్చుకున్నపెట్రోల్ పోసి నిప్పంటించాడని సమాచారం. కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న దానేశ్వరిని ఆస్పత్రికి తరలించి పరారయ్యాడు. చికిత్స పొందుతూ దానేశ్వరి శుక్రవారం కన్నుమూసింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దానేశ్వరికి వివాహ ప్రయత్నాలు చేస్తుండగా తాను శివకుమార్ ను ప్రేమించిన విషయం చెప్పిందని.. ఆమె తండ్రి అశోక్ శర్మ కన్నీరుమున్నీరయ్యారు. ఈ నేపథ్యంలోనే వివాహ ప్రయత్నాలు విరమించుకున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 16న దానేశ్వరిని సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందని వాపోయారు. ఇదే విషయాన్ని వెంటనే బెంగళూరుకు వచ్చిన తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై చర్యలు తీసుకోవడానికి బదులు తమనే దోషులుగా చూశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మార్చి 1న జరిగింది. చెన్నూరు మండలం కొండ పేట గ్రామం వనంవీధిలో నివసించే కె. జ్యోతి(26) అనుమానాస్పద మృతి కేసులో Mystery వీడింది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆమెను దారుణంగా murder చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఆదివారం Kadapaలో డిఎస్పి వెంకటశివారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామం వనంవీధిలో నివాసముంటున్న రంగనాయకులు భార్య కె.జ్యోతి ఇటీవల Suspicious statusలో మృతి చెందింది.

ఆమె మరణంపై అనుమానం ఉందని అనంతపురం రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా, హత్యకేసుగా మార్చిన పోలీసులు కడప అర్భన్ సీఐ ఎస్ఎం ఆలీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ బృందం వివిధ కోణాలలో విచారించి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రామిరెడ్డి కాలనీకి చెందిన హమాలి బోయ నాగరాజుని నిందితుడిగా గుర్తించింది. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు ఈనెల 26న కొండపేట విఆర్ఓ సుధీర్కుమార్ వద్ద లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.