పరువు హత్య, కన్న కూతురిని కాల్చిచంపిన తండ్రి

Man burns 19-yr-old daughter to death in indore
Highlights

ఆ యువతి ప్రేమించిన వాడి కోసం కన్న  తల్లిదండ్రులనే ఎదిరించింది. తన జీవితాన్ని ప్రేమించినవాడితో పంచుకుని కలకాలం జీవించాలనుకుంది. కానీ కన్న తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ప్రేమ పేరుతో  ఎదిరించిన కన్న కూతురినే ఆ తండ్రి అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే...ఇండోర్ సమీపంలోని చైన్ పూర్ సర్కార్ ప్రాంతంలో నివాసముండే లక్ష్మీబాయ్, రాజ్ కుమార్ లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. ఇందుకోసం తమ కుటుంబ సభ్యులకు వారి ప్రేమ విషయాన్ని తెలియజేశారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లి చేసేందుకు ఇరువర్గాల పెద్దవాళ్లు ఒప్పుకోలేదు.

 దీంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని ఈ ప్రమజంట భావించింది. పోలీసుల సహకారంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇందుకోసం వారు వేసిన ప్లాన్ లక్ష్మీబాయ్ తండ్రి సుందర్ లాల్ జాదవ్ కి తెలిసింది. కూతురు ఇలా పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తండ్రి కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో శరీరం మొత్తం పూర్తిగా కాలిపోయి లక్ష్మీబాయి మృతిచెందింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు కారణమైన సుందర్ లాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

loader