చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో సొంత మేనమామను మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. అతని తల నరికి స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) దారుణం జరిగింది. చేతబడి (black magic) అనుమానంతో ఏకంగా సొంత మేనమామను తల నరికి చంపాడో వ్యక్తి. అనంతరం అతని తల, గొడ్డలిని తీసుకుని రెండు కిలోమీటర్ల దూరంలో వున్న పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు. సిద్ది జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని జామోది (Jamodi ) పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న కరిమతి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల నిందితుడు .. చేతబడి ద్వారా తన మేనమామ సమస్యలు సృష్టిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆయన మీద కక్ష పెంచుకున్నాడు. 

ALso Read:చేతబడి చేస్తానని భయపెట్టి.. యువతిని గర్భవతిని చేసిన 50 ఏళ్ల వ్య‌క్తి..

ఈ క్రమంలో నిందితుడు లాల్‌బహదూర్‌గౌడ్ శుక్రవారం తన మామ మక్సూదన్‌సింగ్ గౌడ్ ఇంటికి ఆవేశంగా వెళ్లాడు. అనంతరం ఆగ్రహంతో మక్సూదన్‌పై గొడ్డలితో దాడి చేసి తలను నరికేశాడని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత నిందితుడు తన మామయ్య తలను, గొడ్డలితో పట్టుకుని పోలీస్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడని చెప్పారు. అయితే మధ్యలోనే లాల్‌బహదూర్‌ను అరెస్ట్ చేశామని జమోది పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వెల్లడించారు. మేనమామ చేతబడి చేసి తనకు సమస్యలు సృష్టిస్తున్నాడని.. ఇలా చేయవద్దని చాలాసార్లు హెచ్చరించానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.