Asianet News TeluguAsianet News Telugu

తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కొట్టి చంపి.. బలవంతంగా మృతదేహం దహనం...

వ్యక్తిని కొట్టిచంపి, మృతదేహాన్ని కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా దహనం చేశారు ముగ్గురు వ్యక్తులు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

man beaten to death by 3, and forcefully cremation in maharashtra - bsb
Author
First Published Jul 21, 2023, 3:26 PM IST

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు 45 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపి, అతని మృతదేహాన్ని బలవంతంగా దహనం చేశారు. దీనికి సంబంధించి బుధవారం ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది.

ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి పేరు సంతోష్ సుదమ్ సర్కాటే. నిందితుల్లో ఒకరైన నితిన్ మనోహర్ పాటిల్ ఫామ్‌హౌస్‌లో ఉద్యోగి. ఆ ఫాంహౌజ్ డోంబివాలి ప్రాంతంలో ఉంది. అందులో మృతుడు పనిచేస్తుండేవాడు. జనవరి 10న బాధితురాలి కుమారుడు, అమ్మమ్మ ఎదుటే ఈ ఘటన జరిగింది. 

మణిపూర్ లో మరో షాకింగ్.. నరికిన మనిషి తల వీడియో వైరల్...

తన రైఫిల్‌ను భద్రంగా ఉంచాలని.. నిందితుడు సర్కాటేను అడిగి, తన రైఫిల్ ఇచ్చాడని వెల్లడించారు. అయితే, పాటిల్ దానిని తిరిగి ఇవ్వమనడంతో.. దాన్ని ఎక్కడ పెట్టాడో సర్కాటేకు గుర్తుకు రాలేదు. దీంతో పాటిల్ మరో నిందితుడు అభిషేక్ ప్రదీప్ లాడ్‌తో కలిసి సర్కాటేపై శారీరకంగా దాడి చేశాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

బాధితుడి కుటుంబ సభ్యుల కోరికకు వ్యతిరేకంగా నిందితులు సర్కాటే మృతదేహాన్ని డోంబివాలిలోని శ్మశానవాటికలో దహనం చేశారని పిటిఐ తెలిపింది. నిందితులు బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నితిన్ పాటిల్, అభిషేక్ లాడ్, విజయ్ గణపత్ పాటిల్‌లపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. హత్య, నేరపూరిత బెదిరింపు, సాక్ష్యాలను దాచడం వంటి అభియోగాలు వారిపై మోపారు.

Follow Us:
Download App:
  • android
  • ios