మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియో వెలుగుచూసిన కొద్ది రోజులకే, మరో షాకింగ్ వీడియో బయటపడింది. మణిపూర్ లో ఓ కుకీ వ్యక్తి తల నరికిన దృశ్యానికి సంబంధించిన వీడియో వెలుగు చూసింది.
మణిపూర్ : సోషల్ మీడియాలో ఇప్పుడు మణిపూర్ కు చెందిన మరో వీడియో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి తల నరికిన భయంకరమైన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయి.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.
బిష్ణుపూర్ జిల్లాలోని నివాస ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెపై డేవిడ్ థీక్ అనే ఓ కుకీ వ్యక్తి నరికిన తల ఈ వీడియోలో కనిపిస్తుంది. జూలై 2న ఉదయం 12 గంటలకు జరిగిన ఘర్షణలో థీక్ మరణించాడు, ఇందులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
‘ఆడపిల్లలు, పేదరికాన్ని చూసి దయతో ఇల్లు అద్దెకిచ్చాను’.. అద్దె ఇంటిలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు
మణిపూర్‌లో శుక్రవారం మే 4 న చిత్రించిన వీడియోలో మహిళలను నగ్నంగా ఊరేగించి, పురుషుల గుంపు పట్టుకున్నట్లు చూపడంతో కొత్త ఉద్రిక్తత నెలకొంది. వీడియో వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత నలుగురిని అరెస్టు చేశారు. హింసాకాండకు వ్యతిరేకంగా గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
మణిపూర్ ఇంఫాల్ లోయలో ఉన్న మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, కొండలలో ఉన్న గిరిజన కుకీల మధ్య మే నుండి జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. మణిపూర్ లో చెలరేగుతున్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 160 మంది చనిపోయారు.
