Brazil Doctor rape Woman: ఓ వైద్యుడు త‌న వృత్తి ధర్మాన్ని మరిచాడు. పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ నిండు గ‌ర్భ‌ణీపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ‌మైన  ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.   

Brazil Doctor rape Woman: వైద్యుడుని క‌లియుగ‌ భగవంతుడుగా భావిస్తారు. అలాంటి ప‌విత్ర‌మైన‌ వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. త‌న వృత్తి ధర్మాన్ని మరిచి.. ఓ నిండు గ‌ర్భ‌ణీపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ‌మైన ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌లో ఒక వైద్యుడు ప్రసవ సమయంలో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సి-సెక్షన్ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళతో అత్యాచారం చేశాడు. ఈ ఘటన మొత్తం సీక్రెట్‌ కెమెరాలో రికార్డయింది. ఈ వైద్యుడు ఇలాంటి ఐదు ఘటనలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 

అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. రియో డి జనీరోలోని ఓ హాస్పిటల్ కి ప్రసవం కోసం ఓ నిండు గర్భిణి వచ్చింది. ఆమెను ప‌రిశీలించిన వైద్యులు ఆమెకు సాధారణ ప్ర‌స‌వం చేయ‌డం సాధ్యం కాద‌నీ, ఆమెకు సీ సెక్ష‌న్ చేయాల‌ని వైద్యులు భావించారు. ఈ క్ర‌మంలో గియోవన్నీ క్వింటెల్లా బెజెర్రా(32) అనే అనస్థీషియా ఇచ్చే వైద్యుడిని ఆప‌రేష‌న్ థియేట‌ర్ కు పిలిచారు. ఆ వైద్యుడు త‌న వృత్తి ధ‌ర్మాన్ని మ‌రిచి.. గ‌ర్భ‌ణి స్త్రీకి మ‌త్తుమందు ఇచ్చి.. ఆమె మ‌త్తులోకి వెళ్ల‌గానే.. ఆమెపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న లైంగిక వాంఛ‌ను తీర్చ‌కున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్ప‌త్రి వ‌ర్గాల ఫిర్యాదు మేర‌కు గియోవన్నీ క్వింటెల్లా బెజెర్రా ను రియో ​​డి జనీరోలో అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. 

ఆపరేషన్ థియేటర్‌లో సీక్రెట్ కెమెరా

బెజ్రా కొన్ని నెలల క్రితమే అనస్థీషియా కోర్సు పూర్తి చేశాడు. రియో డి జనీరోలోని ఓ హాస్పిటల్ లో అనస్థీషియా డాక్ట‌ర్ గా నియ‌మితుడ‌య్యాడు. అయితే.. బెజెరాపై అనుమానం రావ‌డంతో.. ఆయ‌న‌ సరైన మోతాదులో అనస్థీషియా ఇచ్చాడో? లేదో? తనిఖీ చేయాలనుకున్నందున ఆసుపత్రి పరిపాలన విభాగం ఆపరేషన్ థియేటర్‌లో సీసీ కెమెరాను అమర్చింది. సీసీ పుటేజీలు ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేయ‌డంతో ఆ వైద్యుడిని అరెస్టు చేసి.. రిమాండ్ కు త‌ర‌లించారు. నిందితుడికి 8 నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష ప‌డే అవ‌కాశముంది.

ఇప్పటికే ఆరోపణలు

ప్రస్తుతం నిందితుడిని బ్రెజిల్‌లోని బంగు జైలుకు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో డాక్ట‌ర్ బెజెర్రా 2018లో మెడికల్ మాల్ ప్రాక్టీస్ కేసులో అరెస్టు అయ్యిన‌ట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు మరియు మరో వైద్యుడు స్వైన్ ఫ్లూ కేసును యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌గా తప్పుగా చూపించారని, దీనివల్ల 23 మంది మహిళా రోగులు కోమాలోని వెళ్లారని ఆరోపించారు.