Asianet News TeluguAsianet News Telugu

కోటి రూపాయల దొంగను పట్టించిన ఖాళీ వాటర్ బాటిల్... ఎలాగో తెలుసా?

మహారాష్ట్రలో ఓ గోదాంలో సుమారు రూ. 1 కోటి విలువైన బట్టలు చోరీ అయ్యాయి. దొంగలకు సంబంధించిన ఆధారాలేవీ లేకుండాపోయాయి. కానీ, ఆ స్పాట్‌లో ఓ ఖాళీ వాటర్ బాటిల్ కనిపించింది. ఆ వాటర్ బాటిల్ సహకరాంతో పోలీసులు దొంగను పట్టుకుని చోరీ చేసిన స్టాక్‌ను రికవరీ చేసుకున్నారు.
 

empty water bottle helped to catch the thief who robbed around rs 1 crore garments in maharashtras bhiwandi
Author
First Published Jan 15, 2023, 3:54 PM IST

ముంబయి: ఖాళీ వాటర్ బాటిలే కదా? అని తీసిపారేయొద్దు. ఆ ఖాళీ వాటర్ బాటిల్ ఏకంగా కోటి రూపాయల దొంగను పట్టించింది. మహారాష్ట్రలో ఓ గోదాం నుంచి రూ. 99.44 లక్షల విలువైన బట్టలను ఆ దొంగ చోరీ చేశాడు. అయితే, అంతకు ముందు ఆ దొంగ అక్కడ నీళ్లు తాగి ఎంప్టీ వాటర్ బాటిల్ అక్కడే పడేశాడు. ఆ ఎంప్టీ వాటర్ బాటిల్ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకోగలిగారు.

థానే జిల్లా భీవండి పట్టణంలోని ఓ గోదాంలో ఈ నెల 8వ తేదీన భారీ దొంగతనం జరిగింది. ఆ తర్వాత గుర్తు తెలియని నిందితుడిపై కేసు నమోదైంది. పోలీసులు కూడా దొంగను పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అనేక చోట్ల సీసీటీవీ ఫుటేజీ కూడా పరిశీలించారు. పోలీసులు ఓ బృందంగా ఏర్పడి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇంటెలిజెన్స్ శాఖ నుంచి ఇన్‌పుట్లు తీసుకున్నారు.

కానీ, పెద్దగా పురోగతి లేకపోయింది. క్రైం స్పాట్‌లో వారికి ఖాళీ వాటర్ బాటిల్ దొరికింది. మినరల్ వాటర్ బాటిల్‌తోపాటు ఓ చిప్స్ పాకెట్ దొరికిందని భీవండి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నవనాథ్ ధావలే శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

Also Read: మన సైన్యాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు: ఆర్మీ డే సందర్భంగా ప్రధాని మోడీ

గోదాం లో దొరికిన వాటర్ బాటిల్ పై ఉన్న లేబుల్, సమీపం లోని ఓ హోటల్‌ లోని వాటర్ బాటిల్ లేబుల్‌తో సరి పోలిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఆ హోటల్ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలతో సీసీటీవీ ఫుటేజీ ని పరీక్షించినట్టు అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే నేర చరిత్ర ఉన్న నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టి.. ఆ గోదాం నుంచి దొంగిలించిన మొత్తం దుస్తుల స్టాక్‌ను పోలీసులు రికవరీ చేసుకున్నట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios