ఉత్తరాఖండ్‌లో (uttarakhand) దారుణం జరిగింది. ఉధమ్‌సింగ్ నగర్ (udham singh nagar) జిల్లాలోని సితార్‌గంజ్ (sitarganj) పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని అంకుల్‌ (uncle) అని పిలిచినందుకు 18 ఏళ్ల బాలికపై క్రూరంగా దాడి చేశాడు. 

ఉత్తరాఖండ్‌లో (uttarakhand) దారుణం జరిగింది. ఉధమ్‌సింగ్ నగర్ (udham singh nagar) జిల్లాలోని సితార్‌గంజ్ (sitarganj) పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని అంకుల్‌ (uncle) అని పిలిచినందుకు 18 ఏళ్ల బాలికపై క్రూరంగా దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం జరిగిన ఈ సంఘటనలో నిషా అహ్మద్‌‌ను బాధితురాలిగా గుర్తించారు. దుకాణదారుడి దాడిలో ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు .. నిందితుడు మోహిత్ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ALso Read:23ఏళ్ల యువతిపై పదో తరగతి బాలుడి రేప్ యత్నం.. రోడ్డుపై వెళ్తుంటే పొలాల్లోకి లాక్కెళ్లి..

నిషా అహ్మద్ డిసెంబరు 19న తాను కొనుగోలు చేసిన బ్యాడ్మింటన్ రాకెట్‌ డ్యామేజ్ అయినట్లు గుర్తించింది. అనంతరం దానిని మార్చుకోవడానికి పట్టణంలోని ఖతిమా రోడ్‌లో ఉన్న దుకాణానికి వెళ్లింది. ఇదే సమయంలో షాపులో వున్న మోహిత్‌ని నిషా అంకుల్‌ అని సంబోధించడంతో అతను కోపంతో ఊగిపోయాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన నిషాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.