Asianet News TeluguAsianet News Telugu

23ఏళ్ల యువతిపై పదో తరగతి బాలుడి రేప్ యత్నం.. రోడ్డుపై వెళ్తుంటే పొలాల్లోకి లాక్కెళ్లి..

23ఏళ్ల యువతిపై పదో తరగతి బాలుడు లైంగికదాడికి యత్నించాడు. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ యువతిపై దాడికి దిగి పొలాల్లోకి లాక్కెళ్లాడు. కానీ, ఆ బాలుడి చెర నుంచి యువతి తప్పించుకుని సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం ఆ మైనర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేరళలోని మలప్పురం జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 

minor attempted rape on 23 year old woman in kerala
Author
Thiruvananthapuram, First Published Oct 27, 2021, 4:57 PM IST

తిరువనంతపురం: Keralaలో 15ఏళ్ల బాలుడు ఓ యువతిపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో భౌతికదాడికి దిగారు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఆ యువతిని బంధించి ఆమెను Rape చేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఎలాగోలా ఆమె తప్పించుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి కేరళలోని Malappuram జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రతి రోజు లాగే ఆ రోజు కూడా 23 ఏళ్ల Woman ఇంటి నుంచి కొండొట్టిలోని కంప్యూర్ సెంటర్‌కు బయల్దేరింది. ఇందుకోసం ముందుగా కొట్టుక్కార జంక్షన్‌కు వెళ్లాలి. ఈ జంక్షన్ తన ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఆటోలో ఎక్కి లేదా పొలాల గట్లపై షార్ట్ కట్‌లోనూ అప్పుడప్పుడు ఇక్కడికి చేరుకుంటుంది. ఆ రోజు రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నది. ఆమెను గమనించిన ఓ దుండగుడు వెంబడించాడు.

వెనుక నుంచి ఆమాంతంపై ఆమెపై దాడి చేశాడు. ఆమె రెండు చేతులను బంధించే ప్రయత్నం చేశాడు. ఆమెను అణచివేయడానికి చేతిలో ఓ రాయి తీసుకుని ముఖంపై బాదాడు. తర్వాత సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. తన ఓవర్ కోట్‌తో ఆమె చేతులను కట్టివేశాడు. కానీ, ఆమె ఆ మైనర్ నుంచి తప్పించుకోగలిగింది. అక్కడి నుంచి పరుగెత్తి.. సమీపంలోని ఓ ఇంటికి చేరింది. ఆ ఇంటిలోని మహిళ వార్డ్ కౌన్సిలర్‌కు విషయాన్ని చేరవేసింది. ఆమెకు ప్రథమ చికిత్స అందించారు.

Also Read: హైదరాబాద్ లో దారుణం... కన్న కూతురిపైనే కామాంధుడి అత్యాచారయత్నం

బాధితురాలు చెప్పిన వివరాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పదో తరగతి విద్యార్థి. రాష్ట్రస్థాయి జూడో చాంపియన్. ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రతిఘటించే క్రమంలో ఆ యువతి చేతి గోర్లు మైనర్‌ను గాయపరిచాయి. చేయి, మెడ, పెదవులపై గాయాలున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఆ గాయాల గురించి బాలుడిని తల్లిదండ్రలు అడగ్గా.. ఓ కుక్క వెంటపడితే తప్పించుకునే క్రమంలో కిందపడ్డట్టు చెప్పారని పోలీసులు తెలిపారు. అయితే, తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో ఈ నేరానికి పాల్పడినట్టు మైనర్ ఒప్పుకున్నాడని వివరించారు. త్వరలోనే జువైనెల్ జస్టిస్ బోర్డు ముందు ఆయనను హాజరుపరుచనున్నట్టు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios