కన్నకొడుకు కుటుంబాన్ని అతి దారుణంగా హతమార్చిన తండ్రి.. పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆ తరువాత విషం తాగి...
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన కన్న కొడుకు కుటుంబాన్నే అంతమొందించాలనుకున్నాడు. గాఢనిద్రలో ఉండగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

కేరళ : ఓ వ్యక్తి తన కొడుకు, కోడలు, మనవడిని అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో వెలుగు చూసింది. రాత్రిపూట తమ గదిలో నిద్రిస్తున్న కోడలు, కొడుకు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో తప్పించుకోవడానికి వీలుకాక కొడుకు, మనవడు అక్కడికక్కడే మృతి చెందారు.
కోడలు మాత్రం తీవ్ర గాయాలతో చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉంది. వీరిని చంపడానికి ప్రయత్నించిన నిందితుడు ఆ తరువాత ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికోసం విషం తాగాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు ఇలా తెలియజేశారు. సదరు నిందితుడి పేరు జాన్సన్. జాన్సన్ కుమారుడు జోజి (38), కోడలు లిజీ (33), మనవడు (12) ఇంట్లో నిద్రపోతున్న సమయంలో వారి మీద పెట్రోల్ చల్లాడు. ఆ తర్వాత నిప్పంటించాడు.
మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని.. కసాయిగా మారిన కన్నతండ్రి.. ఏం చేశాడంటే ?
అనుకోని ఈ పరిణామానికి మేలుకొని తప్పించుకునే అవకాశం లేక జోజీ, అతని కొడుకు మృతి చెందారు. లిజీ మాత్రం 50 శాతం కాలిన గాయాలతో తప్పించుకోగలిగింది. ఆమె ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడుతోంది. వీరి గదిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత జాన్సన్ విషం తాగాడు.
అర్ధరాత్రి పూట పక్కింట్లో నుంచి మంటలు, కేకలు వినిపించడంతో అప్రమత్తమమైన స్థానికులు వెంటనే వీరందరిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం జాన్సన్ త్రిసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం కుటుంబ కలహాలే అని సమాచారం.