మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని.. కసాయిగా మారిన కన్నతండ్రి.. ఏం చేశాడంటే ?
మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని ఆ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురును అని చూడకుండా ఆ పసి కూనను క్రూరంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాలో జరిగింది.
ఆ దంపతులకు ఇది వరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే తనకు కుమారుడు కావాలని ఆ తండ్రి అనుకున్నాడు. దాని కోసమే ఎదురు చూశారు. కానీ మూడో సారి కూడా ఆడపిల్లే జన్మించింది. దీనిని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఒక్క సారిగా కసాయిగా మారిపోయాడు. ఆ శిశువు గొంతులో పొగాకు కుక్కి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. జల్ గావ్ జిల్లాలోని హరినగర్ తండాకు చెందిన 30 ఏళ్ల గోకుల్ జాదవ్ కు కొన్నేళ్ల కిందట గోకుల్ అనే మహిళతో వివాహం అయ్యింది. గోకుల్ కు మగ పిల్లలు అంటే ఇష్టం. అయితే భార్యకు మొదటి కాన్పుల్లో ఆడపిల్ల జన్మించింది. రెండో కాన్పులోనూ అలాగే జరిగింది. దీంతో అప్పటి నుంచి అతడు ఆగ్రహంగా ఉన్నాడు.
మూడో కాన్పులోనైనా మగ బిడ్డ జన్మిస్తాడని అతడు ఆశగా ఉన్నాడు. కానీ ఈ సారి కూడా ఆడపిల్లే జన్మించింది. దీంతో అతడు కోపోద్రిక్తుడయ్యాడు. కన్న కూతురు పట్ల క్రూరంగా ఆలోచించాడు. ఆ పసి కూనను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ పసి బిడ్డ నోట్లో పొగాకు కుక్కాడు. దీంతో ఆ శిశువు ఊపిరాడక చనిపోయింది. ఆ ఇంటిని స్థానిక ఆశా కార్యకర్త సందర్శించిన సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ పసి పాప డెడ్ బాడీని వెలికి తీశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.