అలా ప్రశంసలు కురిపించిన వారిలో ఆనంద్ మహీంద్ర కూడా ఉన్నారు. అయితే,  ఇంత బాగా ఆడినందుకు సిరాజ్ కి కూడా ఓ ఎస్ యూవీ బహుమతిగా ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించాడు.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఓ వ్యాపారవేత్తగా కంటే, కూడా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తనకు నచ్చిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఎవరైనా ఏదైనా గొప్ప పనిచేసినా, ఆయన ప్రశంసించకుండా ఉండలేరు. అంతేకాదు, ఆయన చాలా మంది క్రీడాకారులకు కార్లు కూడా బహుమతిగా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ఆనంద్ మహేంద్రను ఓ కోరిక కోరాడు. ఇటీవల ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ అదరగొట్టాడు. మొత్తం 6 వికెట్లు తీసి, శ్రీలంకకు చెమటలు పట్టించాడు. దీంతో, అందరూ సిరాజ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అలా ప్రశంసలు కురిపించిన వారిలో ఆనంద్ మహీంద్ర కూడా ఉన్నారు. అయితే, ఇంత బాగా ఆడినందుకు సిరాజ్ కి కూడా ఓ ఎస్ యూవీ బహుమతిగా ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించాడు.

Scroll to load tweet…

అతని ప్రశ్నకు వెంటనే ఆనంద్ మహీంద్రా స్పందించారు. సిరాజ్‌కు గతంలోనే ఓ కారు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా సిరాజ్‌కు 2021లోనే ఆనంద్ మహీంద్రా ‘థార్‌’ను బహుమతిగా ఇచ్చారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన సందర్భంగా అప్పట్లో ఆ కారును బహుకరించారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద్వారా తనకు లభించిన ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ సిబ్బందికి బహుమతిగా ఇస్తున్నట్లు సిరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా స్పందించిన ఆనంద్ మహీంద్రా సిరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. సిరాజ్ నిర్ణయంపై ఒక మాట చెబుదామనుకుంటున్నానని, అది క్లాస్ అని పేర్కొన్నారు. ‘‘ఇది మీ సంపద లేదా మీ నేపథ్యం నుంచి వచ్చేది కాదు. మీలో ఉంటేనే బయటికి వస్తుందని’’ అని ఆయన ట్వీట్ చేశారు.