ఏ పాము కాటేసిందో చెప్పడానికి.. పాముతో పాటు ఆసుపత్రికి..!!

Man arrived hospital with snake at Bihar
Highlights

ఏ పాము కాటేసిందో చెప్పడానికి.. పాముతో పాటు ఆసుపత్రికి..!!

పాము కాటేస్తే.. మనం ఏం చేస్తాం.. వెంటనే ఆసుపత్రికి వెళతాం కానీ.. కాటేసిన పాముని పట్టుకుని దానిని ఆసుపత్రికి తీసుకెళ్లం కదా.? అయితే బిహార్‌లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. బిహియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వానియాలో ఒక కూల్ డ్రింక్ దుకాణాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ ప్రసాద్ అనే వృద్ధుడిని.. గోడౌన్‌లోంచి కూల్‌డ్రింకులు తెస్తుండగా అతని చేతి మీద పాము కాటువేసింది.. దీంతో అతను ప్రాణభయంతో కేకలు పెట్టాడు.. ఇది విన్న కుటుంబసభ్యులు, స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చి... సత్యనారాయణ కాలికి విషం ఎక్కకుండా కట్టుకట్టారు..

అనంతరం ఆ పామును వెతికి పట్టుకుని చంపకుండా దానితో పాటు బాధితుడిని తీసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. వారి చేతిలోని పామును చూడగానే హాస్పటల్‌ సిబ్బంది వణికిపోయారు.. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న వైద్యులు ఆ పామును బయట విడిచిపెట్టి రావాలని గట్టిగా మొట్టికాయలు వేశారు.. అనంతరం ఆ వృద్ధునికి చికిత్స అందించారు. ట్రీట్ మెంట్ తర్వాత పామును ఎందుకు తీసుకువచ్చారు అని వైద్యులు ప్రశ్నించగా... ఏ పాము కాటేసిందో చెబితే.. అందుకు తగ్గ చికిత్స పొందవచ్చనే ఉద్ధేశ్యంతోనే తాము ఇలా చేశామని చెప్పడంతో అక్కడున్న వారు తెల్లముఖం వేశారు.

loader