గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనల్లో నలుగురు చిన్నారులు కామాంధుల వికృత కేళికి బలైపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు మృత్యవాత పడ్డారు.
దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇలాంటి దారుణమైన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా కలోల్ మండలం వన్సజదా గ్రామానికి చెందిన విజయ్ ఠాకూర్ (26) పది రోజుల వ్యవధిలో ముగ్గురి మీద rape attempt చేశాడు. అత్యాచారం అనంతరం వారిలో ఒకరిని కిరాతకంగా చంపేశాడు కూడా.
రోజు కూలీగా పనిచేసే Vijay Thakurకు భార్య, కుమార్తె ఉన్నారు. అయితే విజయ్ సెల్ ఫోన్ లో బాగా porn videos, blue films చూడడానిక అలవాటు పడ్డాడు. అలా మొదట నవంబర్ 4న రంచర్దా గ్రామంలో ఐదేళ్ల బాలికను kidnap చేసి, అత్యాచారం చేశాడు. బాలికకు చేసిన వైద్య పరీక్షల్లో ఈ విషయం బయట పడింది.
ఆ తరువాత నవంబర్ అయిదో తేదీ రాత్రి మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు విజయ్. అయితే ఆమె మీద అత్యాచారం చేయబోగా భయపడ్డ చిన్నారి గట్టిగా ఏడ్చి, కేకలు పెట్టింది. దాంతో ఆ చిన్నారి నోరు మూయించడానికి ఆమెను కిరాతకంగా చంపేశాడు.
ఆ తరువాత dead body మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడేళ్ల చిన్నారి మృతదేహం మీద అత్యాచారం చేసి.. శవాన్ని స్థానికంగా ఉన్న కల్వర్టు దగ్గర పడేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో పోలీసులకు విస్తుపోయే మరో నిజం తెలిసి షాక్ అయ్యారు. విజయ్ పది రోజుల క్రితం కూడా ఓ అత్యాచారం చేశాడని తేలింది. కొత్త బట్టలు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఏడేళ్ల బాలిక మీద విజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనుమతి లేకుండా.. బోరు నీళ్లు తాగాడని వృద్ధుడిని చితకబాది, ప్రాణాలు తీశారు..
ఇదిలా ఉండగా.. రెండున్నరేళ్ల పసికందుపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దారుణమైన ఈ ఘటనలో ఆ చిన్నారి మరణించడం అందర్నీ కలిచివేస్తోంది. పాప తల్లిదండ్రులు బీహార్ నుంచి రాజస్థాన్ కు వచ్చారు. వారు వలసకూలీలు. ఇక్కడే కులీపనులు చేసుకుంటున్నారు. ఈ కుటుంబానికి చెందిన ఆ పాప... దీపావళి రాత్రి ఆడుకుంటూ Disappear అయ్యింది.
అంతా వెతికిన తల్లిదండ్రులు, పోలీస్ కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు.. ఆ కుటుంబం ఉంటున్న ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ కర్మాగారం వద్ద ఆదివారం శిశువు మృతదేహాన్ని గుర్తించారు.
ఆ చిన్నారి మృతదేహం పడి ఉన్న స్థితిని బట్టి రేప్ చేసి చంపేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ తరువాత మృతదేమాన్ని పోస్టు మార్టానికి పంపారు. నిందితుడు పసికందును Sexually harass చేశాడని, ఆ తర్వాత గొంతు నులిమి చంపేసినట్లు శవ పరీక్షల్లో వెల్లడయ్యింది. గుడ్డూ యాదవ్ అనే వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
