New Delhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ల‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్య‌క్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అంత‌కుముందు ఒక బెదిరింపు కాల్ చేసిన నిందితుడు, బుధ‌వారం ఉదయం 10:54 గంటలకు రెండో ఫోన్ కాల్  చేసి ఈసారి రూ.2 కోట్లు ఇవ్వకపోతే ప్రధానిని, హోంమంత్రిని చంపేస్తానని బెదిరించిన‌ట్టు పోలీసులు తెలిపారు. 

Man arrested for threatening to kill Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ల‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్య‌క్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అంత‌కుముందు ఒక బెదిరింపు కాల్ చేసిన నిందితుడు, బుధ‌వారం ఉదయం 10:54 గంటలకు రెండో ఫోన్ కాల్ చేసి ఈసారి రూ.2 కోట్లు ఇవ్వకపోతే ప్రధానిని, హోంమంత్రిని చంపేస్తానని బెదిరించిన‌ట్టు పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లను చంపేస్తామని బెదిరించి పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్స్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వృత్తిరీత్యా కార్పెంటర్ అయిన సుధీర్ శర్మ రెండుసార్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తాగుబోతు అని అత‌ని కొడుకు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. "అతను తాగుబోతు. దర్యాప్తులో నిందితుడు మద్యం మత్తులో ఈ కాల్స్ చేసినట్లు గుర్తించామని" డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్) హరేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం ఉదయం 10:46 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చిందనీ, రూ.10 కోట్లు ఇవ్వకపోతే బీహార్ ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించాడు.

ఆ తర్వాత ఉదయం 10.54 గంటలకు రెండోసారి ఫోన్ చేసి, ఈసారి రూ.2 కోట్లు ఇవ్వకపోతే ప్రధానిని, హోంమంత్రిని చంపేస్తానని చెప్పాడు. మొదటి కాల్ లొకేషన్ నంగ్లోయి ప్రాంతంలో ఉందనీ, రెండో కాల్ పశ్చిమ్ విహార్ (ఈస్ట్) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. పశ్చిమ్ విహార్ (ఈస్ట్) పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, మరో నలుగురు సిబ్బంది నిందితులను గుర్తించే పనిలో ఉన్న‌ట్టు తెలిపారు. ఆ వ్యక్తి ఇంట్లో లేడని, అతని కుమారుడు అంకిత్ తన తండ్రి కార్పెంటర్, మద్యానికి బానిస అని పోలీసులకు చెప్పారు. బుధవారం తెల్లవారుజాము నుంచి తన తండ్రి మద్యం సేవించినట్లు అత‌ని కుమారుడు పోలీసులు తెలిపాడు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.