సారాంశం
ఓ తండ్రి కూతురిమీదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తట్టుకోలేని ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అరెస్ట్ చేశారు.
చెన్నై : ఓ కన్న తండ్రి కసాయిలా మారాడు.. కామాంధుడై కూతురి మీదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి (37) కూతురు ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటుంది. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి ఆమె మీద కన్నేసాడు. కొద్ది రోజులుగా కుమార్తపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా తెలిసింది.
ఆ వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో.. తట్టుకోలేని బాధితురాలు తిరుచెంగొడు మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దీని మీద వెంటనే విచారణ చేపట్టారు పోలీసులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామాంధుడైన తండ్రిని అరెస్టు చేశారు. కామాంధుడైన ఆ తండ్రిని అరెస్టు చేశారు. అతను జైలుకు పంపించినట్లుగా పోలీసులు తెలిపారు.
వరుడు నల్లగా ఉన్నాడని.. మండపంలోనే పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. ఎక్కడంటే...
ఇదిలా ఉండగా, ఈ ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే వరంగల్ లో వెలుగు చూసింది. వరంగల్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీలో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల కుమార్తె మీద అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడో కామాంధుడైన తండ్రి. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యలు గర్బవతి అని చెప్పడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది.
మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గత నెల రోజులుగా మైనర్ అయిన కూతురు మీద పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తల్లి తన బిడ్డను గట్టిగా ప్రశ్నించగా ఆమ అసలు విషయం తెలిపింది.తన తండ్రి మత్తులో ఉన్నప్పుడు తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని వెల్లడించింది.
ఈ లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే.. మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడని, భయపడి ఎవ్వరికీ చెప్పలేదని ఆమె పేర్కొంది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతని మీద ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆ కీచకతండ్రిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపును కాపాడేందుకు వివరాలు వెల్లడించలేదు)