Asianet News TeluguAsianet News Telugu

వరుడు నల్లగా ఉన్నాడని.. మండపంలోనే పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. ఎక్కడంటే...

వరుడి మెడలో దండ వేసే సమయానికి వధువు పెళ్లికి నిరాకరించింది. వరుడు నల్లగా, వయసు ఎక్కువగా ఉన్నాడంటూ పెళ్లికి ఒప్పుకోలేదు. 

bride refuses to marry groom on wedding hall in uttar pradesh - bsb
Author
First Published Jun 5, 2023, 10:38 AM IST

ఉత్తర ప్రదేశ్ : కొద్ది క్షణాల్లో తాళి కడతారు అనగా.. పెళ్లికూతురో, పెళ్ళికొడుకో వివాహాన్ని నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఒక విచిత్రమైన ఘటనే  ఉత్తర ప్రదేశ్ లోని కౌశంబిలో వెలుగు చూసింది. తన కాబోయే భర్తలో లోపం ఉందంటూ ఓ పెళ్లి కూతురు పెళ్లికి నిరాకరించింది. అనుకోని ఈ హఠాత్పరిణామానికి పెళ్లికి వచ్చిన వారంతా అయోమయంలో పడ్డారు.

చివరి నిమిషంలో ఇదెక్కడి గోల రా బాబు అంటూ..  తలలు పట్టుకున్నారు. వధువు ఈ విషయాన్ని వరుడుమెcలో దండ వేసేందుకు వివాహ వేదిక పైకి వచ్చినప్పుడు చెప్పడంతో అందరూ కంగుతున్నారు. వివాహ తంతులో భాగంగా వరుడి మేడలో దండ వేయడానికి వేదిక మీదికి వచ్చిన వధువు.. అతడిని పరిశీలనగా చూసింది. వెంటనే అతడిని వివాహం చేసుకోవడం తనకి ఇష్టం లేదంటూ దండ కూడా వేయలేదు.

వధువు నిర్ణయాన్ని విన్న వారంతా షాకయ్యారు..ఇంతకీ కారణమేంటటా అంటే.. వరుడు రంగు తక్కువగా ఉన్నాడట. దీంతో అలాంటి వరుడు తనకు వద్దు అంటూ ఆమె నిరాకరించింది. అంతేకాదు, అతడు తనకంటే చాలా ఎక్కువ వయసు ఉన్నట్టుగా కనిపిస్తున్నాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ మాటలు విన్న వరుడు, వధువు కుటుంబ సభ్యుల్లో కలకలం రేగింది.

పెళ్లికి వచ్చిన వారు ఎంత చెప్పినా ఆమె ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక గ్రామంలో పంచాయతీ పెట్టించారు. అక్కడివారు కూడా ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆ వధువు ఒప్పుకోలేదు.  దీంతో చేసేదేం లేక వరుడు, అతని బంధుమిత్రులు వెనక్కి తిరిగారు. 

తేని జిల్లాలో భారీ విధ్వంసం.. ఎట్టకేలకు చిక్కిన అరికొంబన్ ఏనుగు..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఓ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. పెళ్లికి కొన్ని గంటలు ఉండగా ఓ వధువు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. గంటలు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో బంధువులు ఆమెను తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ వారికి వధువు కనిపించకపోగా.. షాకింగ్ విషయం తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… రాజస్థాన్లోని భారీ ప్రాంతానికి చెందిన శిల్పి అనే యువతికి మధ్యప్రదేశ్ లోని కొత్వాలి పరిధి మోరెనా ప్రాంతానికి చెందిన యోగేష్ వర్మ అనే యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.

 మే 29వ తారీఖున యోగేష్, శిల్పి వివాహం జరగాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు కళ్యాణం జరగాల్సిన మే 29న పెళ్లి మండపానికి చేరుకున్నారు. మండపమంతా బంధువులు, స్నేహితులతో  కళకళలాడుతోంది. వరుడు కూడా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నాడు. వివాహ తంతు మొదలయ్యింది. వధువును తీసుకురమ్మని చెప్పారు. కానీ, ముహూర్తానికి కొద్ది గంటల ముందు బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది శిల్పి. పెళ్లికి మేకప్ వేయించుకుని వస్తానని వెళ్లిన శిల్పి ఎంతకీ తిరిగి రాలేదు. వచ్చేస్తుందిలే అని కాసేపటి వరకు ఓపికగా ఎదురు చూశారు. కానీ నిమిషాలు గంటలుగా మారి గడిచిపోతున్నాయి కానీ శిల్పి జాడలేదు.

దీంతో వధువు తరపు బంధువులు  బ్యూటీ పార్లర్ కు వెళ్లారు. అయితే అక్కడ వధువు లేదు. అసలు ఆమె అక్కడికి రాలేదని అక్కడివారు చెప్పారు. దీంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. వధువు కనిపించడం లేదని.. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందన్న విషయం తెలిసిన వరుడు, అతని కుటుంబ సభ్యులు..పెళ్లికి వచ్చిన వారందరూ ఒకసారిగా షాక్ అయ్యారు.

ఈ విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన వారంతా వెళ్ళిపోయారు.  దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు యువతి 150 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా తీసుకెళ్లిందని ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుందనేది  మిస్టరీగా మారింది..  పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పెళ్లి పందిరిలో కనిపించాల్సిన వధువు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన మధ్యప్రదేశ్లో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios