హెచ్ఐవీ ఉందని చెప్పినా వినకుండా.. ఓ యువకుడు మహిళపై అగగాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. గత శుక్రవారం ఈ దారుణం జరగగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయికి చెందిన ఓ మహిళ.. తన సోదరి ఆరోగ్యం దృష్ట్యా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో... ఆమెకు అక్కడే ఉన్న ఓ యువకుడకు పరిచయం అయ్యాడు. ఆమెతో మాట కలిపి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కున్నాడు. తాను చెప్పినట్లు చేస్తే.. ఫీజులో రాయితీ ఇస్తానని.. తన సోదరికి మందులు ఉచితంగా ఇస్తానని నమ్మించాడు.

ఆ మాటలు చెబుతూనే ఆమెను ఆస్పత్రిలో బిల్డింగ్ లోని పై అంతస్థుకు తీసుకువెళ్లాడు. అక్కడ ఎవరూలేరని నిర్ధారించుకున్నాక.. మహిళపై అత్యాచారినికి పాల్పడ్డాడు. తనకు హెచ్ఐవీ ఉందని ఆమె చెబుతున్నా కూడా అతను వినిపించుకోకుండా పశువులా ప్రవర్తించడం గమనార్హం.

కాగా.. బాధితురాలు వెంటనే సమీపంలోని సియాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దీపక్‌ అన్నప్ప అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.