రెండు రోజుల కిందట ఢిల్లీలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. చున్నీతో గొంతు నులిమి ఆమెను దుండగుడు హత్య చేశాడు. అయితే ఈ కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమైందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు.
వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ఆ మహిళతో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడు ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేశారు. జూన్ 23వ తేదీన ఢిల్లీలో వెలుగు చూసిన మహిళ దారుణ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. దానికి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు.
26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారికి పాకిస్థాన్‌లో 15 ఏళ్ల జైలు శిక్ష
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన మహిళకు ఏడాది కిందట షాజహాన్‌పూర్ ప్రాంతానికి చెందిన అజయ్‌తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తరువాత ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాదాపు చాలా కాలం పాటు వీరి వ్యవహారం సాఫీగా సాగింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ మహిళ అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. అజయ్ నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. అలాగే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. దీంతో అతడు ఆ మహిళ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో వారం రోజుల కిందట ఆ మహిళ తన కోడలిని చూడటానికి ఢిల్లీ వచ్చింది. ఇదే మంచి సమయంగా భావించిన నిందితుడు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 22వ తేదీన రాత్రి పూట ఆమెకు కాల్ చేసి బయటకు రావాలని కోరాడు. దీంతో ఆమె బయటకు వచ్చింది. అనంతరం ఆ మహిళను స్థానికంగా ఉన్న లాల్ ఫామ్ సమీపంలోని మోహన్ గార్డెన్ కు తీసుకెళ్లాడు. అక్కడ పథకం ప్రకారం ఆమెను చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
Maharashtra crisis: శివసేన రాజకీయ సంక్షోభంతో మాకు సంబంధం లేదు: మహారాష్ట్ర బీజేపీ చీఫ్
ఈ హత్య విషయం మోహన్ గార్డెన్ పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐపీసీ 302/201 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మృతురాలు యూపీకి చెందినదని గుర్తించారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీ, మృతురాలి సీడీఆర్‌ను విశ్లేషించించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సాంకేతిక నిఘా ఆధారంగా అతడిని వెంబడించారు. ఢిల్లీ, యూపీలోని అతడి రహస్య స్థావరాలపై దాడులు చేపట్టారు. అనంతరం చివరకు నిందితుడిని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. బాధితురాలి మొబైల్, నేరం జరిగిన సమయంలో నిందితుడు ధరించిన దుస్తులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
