బ్రిటీష్ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన అండర్ ట్రయల్ ఖైదీ గోవా జైలు నుంచి తప్పించుకున్నాడు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గోవాకు చెందిన రామచందన్ యెల్లప్ప 2018లో దక్షిణ గోవాలోని కెనకోనాలో బ్రిటీష్ మహిళపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టు అయ్యారు. ఖైదీ రామచంద్రన్ యెల్లప్ప పారిపోయిన ఘటనపై జైలు అధికారులు తిప్పలు పడుతున్నారు.

యెల్లప్ప జైలు ప్రధాన ద్వారాం గుండా బయటకు వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజ్ లో తేలింది. జైలు ప్రహరీ గోడ దూకి వెళ్లాడా..? లేదా కుడివైపు నుంచి పారిపోయాడా అనేది జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లేదా యెల్లప్ప జైలు కాంప్లెక్సులోనే ఉన్నాడని తాము నమ్మతున్నామని జైలు అధికారి ఒకరు తెలిపారు.

యెల్లప్ప గత జూన్ నెలలో కోర్టులో హాజరుపరిచినప్పుడు టాయ్ లెట్ కు వెళ్లి వెంటిలేటరు గాజుపలకను తొలగించి తప్పించుకు పారిపోయాడు. అనంతరం యెల్లప్పను పోలీసులు అరెస్టు చేసి జైలుకి తరలించారు. 2018లో 42ఏళ్ల బ్రిటీష్ మహిళ కెనకోనాలో రైల్వే స్టేషన్ల నుంచి వస్తుండగా.. ఆమెపై యెల్లప్ప అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నాడు.