Asianet News TeluguAsianet News Telugu

కరుణానిధి అంత్యక్రియల గురించి ప్రధానితో మాట్లాడా...కానీ : మమతా బెనర్జీ

తమిళ నాడు మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరుగనున్న అంత్యక్రియల విషయంలో ఏఐడీఎంకే ప్రభుత్వంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చట్ట పరమైన సమస్యలను సాకుగా చూపుతూ మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై వివాదం చెలరేగిన విషయం తెలసిందే. అయితే ఈ విషయం తెలిసి తాను చాలా బాధ పడ్డానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంపై పీఎం నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

Mamata Banerjee Speaks On DMK Chief Karunanidhi's Demise

తమిళ నాడు మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరుగనున్న అంత్యక్రియల విషయంలో ఏఐడీఎంకే ప్రభుత్వంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చట్ట పరమైన సమస్యలను సాకుగా చూపుతూ మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై వివాదం చెలరేగిన విషయం తెలసిందే. అయితే ఈ విషయం తెలిసి తాను చాలా బాధ పడ్డానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంపై పీఎం నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

తమిళ నాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర మాజీ సీఎం కరుణానిధికి అంత్యక్రియల కోసం మెరీనా బీచ్ లో స్థలం కేటాయించలేమని ప్రకటించిడం తనను చాలా అసంతృప్తికి గురిచేసినట్లు మమత మీడియాకు వెల్లడించారు. ఈ విషయం గురించి మాట్లాడాలని సీఎం పళని స్వామిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికి అతడు అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో స్వయంగా ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, ఈ విషయంలో కేంద్ర జోక్యం చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయితే ఎవరి ప్రమేయం లేకుండానే అందుకు అనుమతులు వచ్చాయని గుర్తుచేశారు.

దివంగత నేత కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపేందుకు చివరికి మద్రాసు హైకోర్టు అనుమతివ్వడంతో ఈ వివాదం ముగిసింది. దీంతో  కరుణానిధికి గురువు అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించారు.   
 
Follow Us:
Download App:
  • android
  • ios