పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)లను బిజెపి తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటుందని  అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎవరు పౌరుడో, ఎవరు కాదో బిజెపి నిర్ణయిస్తుందా? అని మమత బెనర్జీ ప్రశ్నించారు. 

సీఏఏ అనేది బీజేపీ చెప్పుతున్న అబద్దమనీ, వేరే ప్రాంతాల నుంచి బెంగాల్‌కు ప్రజలను తీసుకురావాలని బీజేపీ కోరుకుంటోందనీ, పౌరసత్వ హక్కును కించపరిచేలా కొందరు వ్యక్తుల చొరబాటుకు బీజేపీ సహాయం చేయాలనుకుంటోందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ అన్నారు. ఈ దేశ ప్రజలే మోడీని పిఎంగా ఎన్నుకున్నారనీ, తనని సిఎంగా ఎన్నుకున్నారని, వారు దేశ పౌరులు కాకపోతే వారు తన ఓట్లతో ఎలా గెలిపిస్తారు? ఎలా నాయకులకు చేయగలరని మమతా బెనర్జీ అన్నారు. 

కృష్ణా నగర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)ని ఉపయోగిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో సీఏఏ అమలుకు ఎప్పటికీ అనుమతించబోమని మమతా బెనర్జీ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను లేవనెత్తడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని బెనర్జీ ఆరోపించారు.రాష్ట్ర విభజనను తాను ఎప్పటికీ అనుమతించబోనని అన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. బీజేపీ.. సిఎఎ,ఎన్‌ఆర్‌సిని అమలు చేయడం గురించి మాట్లాడుతుందనీ, ఇప్పుడు గుజరాత్ లో కూడా అదే అంశంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని అన్నారు. సీసీఏ సమస్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందనీ, అలా ఓట్లను పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఎవరు పౌరుడో, ఎవరు కాదో బిజెపి నిర్ణయిస్తుందా? మతువా కమ్యూనిటీ కూడా ఈ దేశ పౌరులేననీ, రాజకీయంగా శక్తివంతమైన మతువా కమ్యూనిటీ చాలా మంది ఉత్తర 24 పరగణాలు మరియు నాడియా జిల్లాలలో నివసిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాలలో రాజ్‌వంశీలు, గూర్ఖాలను రెచ్చగొట్టడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లో బిజెపి వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందనీ, పశ్చిమ బెంగాల్ విభజనను తాము ఎప్పటికీ అనుమతించామని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిజెపి తిరిగి అధికారంలోకి రాదని ఆయన పేర్కొన్నారు.

దేశంలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, అప్పటి నుంచి అది మారిపోయిందని బెనర్జీ అన్నారు. 2019లో దేశంలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనీ, బీహార్, జార్ఖండ్, అనేక ఇతర రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు.. దేశవ్యాప్తంగా దాని రాజకీయ ఉనికి తగ్గిపోయిందనీ, రానున్న రోజుల్లో పూర్తిగా అధికారం కోల్పోబోతున్నారని అన్నారు.