ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన్ ధర్మ'కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ప్రజలు హాని కలిగించే అలాంటి విషయంలో జోక్యం చేసుకోవద్దని అన్నారు. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉన్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం పాటించే దేశమని అన్నారు.
సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలతో వివాదం తలెత్తింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. బిజెపి.. ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)ను లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్, TMC వంటి పార్టీలు ప్రకటనపై ఎందుకు మౌనంగా ఉన్నాయి? నిలదీస్తోంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు.
ఆమె మాట్లాడుతూ.. "తమిళనాడు ప్రజలు, సిఎం ఎంకె స్టాలిన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయి. భారతదేశంలో 'భిన్నత్వంలో ఏకత్వం'ప్రధాన అంశం అన్నారు. అలాగే.. ఒక వర్గాన్ని బాధపెట్టే అలాంటి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదని సూచించారు.
"మనం ప్రతి మతాన్ని గౌరవిస్తాను. నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను.. పూజలు చేసే పూజారులకు పింఛన్ ఇస్తాం.. బెంగాల్‌లో దుర్గాపూజను పెద్ద ఎత్తున జరుపుకుంటాం.. గుళ్లు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలకు వెళ్తాం.." అని దీదీ అన్నారు. మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను టీఎంసీ అధినేత్రి ఖండిస్తున్నారా అని ప్రశ్నించగా.. "ఖండించే బదులు, పెద్ద లేదా చిన్న వర్గాల ప్రజలకు హాని కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను." అని బదులిచ్చారు.
