పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో దాడి జరగడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీకి భద్రత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో దాడి జరగడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీకి భద్రత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దీదీ డ్రామాలు ఆడుతున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్ష సాక్షులను కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఆరా తీశాయి. 

నిమై మైతి అనే వ్యక్తికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఓ స్వీట్‌ షాప్‌ ఉంది. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన తన షాప్‌ ఎదురుగానే జరిగిందని.. సాయంత్రం 6.15 గంటలకు మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్తున్నారు.

ఆ సమయంలో ఒక యూటర్న్‌ దగ్గర సంఘటన జరిగింది. మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి.. జనాలకు అభివాదం తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు పరిగెత్తుకురావడంతో.. కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యింది. అంతే తప్ప.. ఆమె మీద ఎవరు దాడి చేయలేదని మైతి చెప్పాడు.

Also Read:వీల్ ఛైర్‌తోనైనా ప్రచారం చేస్తా : ఆసుపత్రి బెడ్‌పై నుంచి మమత సందేశం

ఇక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సైతం ఇదే తరహా వార్తను ప్రచురించింది. అసలు మమతను ఎవరు నెట్టలేదని.. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించింది. సీఎంను చూడటానికి జనం గుమిగూడారు... ఈ గందరగోళంలో ఆమె కాళ్లకి కారు డోర్‌ తగిలి కింద పడ్డారు.

దాంతో ముఖ్యమంత్రి మెడ, కాలికి గాయాలయ్యాయి. అంతే తప్ప ఆమెను ఎవరు నెట్టలేదని సుమన్ మైటీ అనే విద్యార్థి ఏఎన్‌ఐకి తెలిపాడు. మరో ప్రత్యక్ష సాక్షి చిత్రంజన్ దాస్ మాట్లాడుతూ దేవాలయాల సందర్శన నుంచి దీదీ తిరిగి వచ్చేటప్పడు కారు తలుపు తెరిచి కూర్చుని ఉన్నారు.

దాంతో అది ఆమె కాలికి తగిలి గాయలయ్యాయని చెప్పాడు. మరోవైపు మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీని ఆదేశించింది.