Asianet News TeluguAsianet News Telugu

ఫిఫా, రోబ్లెక్స్, పబ్జ్.. గేమ్స్ ఆడుతున్నారా?.. మీ డబ్బులు గోవింద.. 28 ప్రసిద్ధ గేమ్ లలో మాల్వేర్ అటాక్...

స్మార్ట్ ఫోన్స్ వచ్చాక.. ఫోన్ లో గేమ్స్ ఆడడం మామూలుగా మారిపోయింది. దీనికోసం డబ్బులు పెట్టి మరీ కొనుక్కుని ఆడుతుంటారు. అయితే ప్రసిద్ధ గేమ్ ల ముసుగులో మాల్వేర్ వ్యాప్తి చేస్తూ నిలువునా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. 

malware in 28 games like roblox, minecraft exploit 384k players financial data
Author
First Published Sep 16, 2022, 8:55 AM IST

న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ గేమ్స్ తో మాల్ వేర్ దాడిచేసి దాదాపు నాలుగు లక్షల మంది వినియోగదారులు చిక్కుల్లో పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 2021 నుంచి జూన్ 2022 మధ్యకాలంలో Roblox, FIFA, PUBG, Minecraft లాంటి 28 గేమ్‌లలో మాల్వేర్ పేరుతో దాదాపు 92,000 హానికరమైన ఫైల్‌లను  పంపండం ద్వారా 3,84,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులపై ప్రభావం పడింది. 

కాస్పెర్స్కీ పరిశోధకుల ప్రకారం, గత సంవత్సరంలో విడుదలైన ఇతర పెద్ద సిరీస్ గేమ్‌లు - ఎల్డెన్ రింగ్, హాలో, రెసిడెంట్ ఈవిల్ - లాంటి గేమ్ లను కూడా  'రెడ్‌లైన్' మాల్వేర్‌ వ్యాప్తికి అటాకర్స్ చాలా చురుకుగా వాడుకున్నారు. రెడ్‌లైన్ అనేది పాస్‌వర్డ్ దొంగిలించే సాఫ్ట్‌వేర్, ఇది బాధితుడి డివైజ్ నుంచి పాస్‌వర్డ్‌లు, సేవ్ చేసిన బ్యాంక్ కార్డ్ వివరాలు, క్రిప్టోకరెన్సీ వాలెట్‌లు, VPN సేవలకు సంబంధించిన ఆధారాలు వంటి సున్నితమైన డేటాను సంగ్రహిస్తుంది.

“సైబర్ నేరగాళ్లు ఆటగాళ్లపై దాడి చేయడానికి, వారి క్రెడిట్ కార్డ్ డేటాను, గేమ్ ఖాతాలను కూడా దొంగిలించడానికి మరిన్ని కొత్త స్కీమ్‌లు, టూల్స్‌ను సృష్టిస్తున్నారు, అవి ఎక్స్ పెన్సివ్ స్కిన్‌లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న ఇ-స్పోర్ట్స్‌పై స్ట్రైకులు" లాంటివి అని కాస్పెర్స్కీలో సీనియర్ భద్రతా పరిశోధకుడు అంటోన్ వి. ఇవనోవ్ అన్నారు.

బాలికలు, మహిళల సంక్షేమం కోసం మోదీ తీసుకొచ్చిన స్కీమ్స్ ఇవే..

దీంతోపాటు పెద్ద సంఖ్యలో వినియోగదారులు గేమ్ ను డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో అవసరంలేని ప్రోగ్రాంలు, యాడ్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ట్రోజన్ స్పైస్‌ను వినియోగదారులతో పాటు, పరిశోధకులు కూడా గుర్తించారు. ఇది కీబోర్డ్‌లో నమోదు చేయబడిన ఏదైనా డేటాను ట్రాక్ చేయగల, స్క్రీన్‌షాట్‌లను తీయగల స్పైవేర్ కు చెందింది.

“CS:GO, PUBG and Warface” కోసం గేమ్ స్టోర్‌లోని ఇంటర్‌ఫేస్‌ లను అనుకరిస్తూ, స్కామర్‌లు మోసపూరిత పేజీలను సృష్టిస్తారు. ఈ గేమ్ లు బాగా ఆడేవారికి అనేక వెపన్స్, అర్సెనాల్ లను ఉచితంగా అందిస్తారు. ఈ గిఫ్ట్ లను తీసుకోవడానికి ఆటగాళ్ళు Facebook లేదా Twitter వంటి.. తమ సోషల్ నెట్‌వర్క్ ఖాతాల నుంచి లాగిన్ డేటాను నమోదు చేయాలి. ఇలా మొదట అకౌంట్ లను టేకోవర్ చేశాక.. అటాకర్స్ కార్డ్ వివరాల కోసం పర్సనల్ మెసేజ్ లు వెతుకుతారు. లేదా బాధితుడి స్నేహితులను డబ్బు కోసం అడగవచ్చు, ఇక బాధితుడు దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తాడు.. అవతలి వారికి బాధితుడికి ఎంత అనుబంధం, నమ్మకం ఉందన్న దానిమీద ఈ మోసం జరుగుతూ పోతుంటుంది. దీనిమీద వేధింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఇలా ప్రసిద్ధి పొందిన గేమ్స్ టైటిల్స్ ముసుగులో అటాక్ చేయబడిన బాధితులైన వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 2021 మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఇప్పటివరకు అది 13 శాతం పెరిగింది. దీనికి మరో కారణం.. ఫ్రీ గేమ్స్ డౌన్ లోడ్ కోసం వెతకడం కూడా. నమ్మదగని రిసోర్సుల నుంచి ఉచిత గేమ్ లను డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ ను వారంతట వారే తమ డివైజ్ లలోకి అనుమతిస్తారు. దీనివల్ల వారి గేమింగ్ అకౌంట్ లతో పాటు, డబ్బులను కూడా కోల్పోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios