మోడీ లక్షద్వీప్ పర్యటన.. మాల్దీవ్స్ అధికార పార్టీ నేత జాత్యహంకార వ్యాఖ్యలు , మా పవర్ చూపిస్తామన్న భారతీయులు

మాల్దీవ్స్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం)కు చెందిన జాహిద్ రమీజ్.. భారతీయులను అపహాస్యం చేసేందుకు ఎక్స్‌ను వేదికగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి లక్ష్యద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను రమీజ్ పంచుకుంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. 

Maldives PPMs leader Zahid Rameez passes racist remark against Indians while mocking Modis Lakshadweep visit, had sought Indian citizenship earlier ksp

భారత్‌కు మిత్రదేశాల్లో ఒకటైన మాల్దీవ్స్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం) మనదేశానికి దూరంగా జరిగే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తమ దేశంలోని సైనిక స్థావరాలను ఖాళీ చేయాలని భారతదేశానికి అక్కడి ప్రభుత్వ పెద్దలు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పీపీఎంకు చెందిన జాహిద్ రమీజ్.. భారతీయులను అపహాస్యం చేసేందుకు ఎక్స్‌ను వేదికగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి లక్ష్యద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను రమీజ్ పంచుకుంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. దీనికి నెటిజన్లు ధీటుగా బదులిచ్చారు. ఇకపై ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. 

 

 

జనవరి 4న ప్రధాని మోడీ తన లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ‘‘లోకల్ కోసం వోకల్’’ నినాదంతో పర్యాటక రంగానికి ప్రోత్సహంగా ఈ ద్వీపానికి రావాల్సిందిగా ఆయన దేశ ప్రజలను కోరారు. దీనికి సిన్హా అనే ఎక్స్ యూజర్ స్పందించారు. ‘‘ ఎంత గొప్ప ఎత్తుగడ.. కొత్త చైనీస్ తొలుబొమ్మ మాల్దీవులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఇది (మోడీ రావడం) లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని సిన్హా వ్యాఖ్యానించారు. దీనికి జాహిద్ రమీజ్ జనవరి 5న ఘాటుగా బదులిచ్చారు. ‘‘ ఈ చర్య చాలా బాగుంది.. కానీ మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమే. మేం అందించే ఆతిథ్యాన్ని వారు ఎలా అందించగలరు.. వాళ్లు మా అంత శుభ్రంగా వుంటారా, కంపుకొట్టే గదుల్లో పతనం తప్పదు ’’ అంటూ పోస్ట్ చేశాడు. 

 

 

భారతీయులు అపరిశుభ్రంగా, మురికిగా వుంటారంటూ రమీజ్ చేసిన జాత్యహంకార ప్రకటనపై పలువురు నెటిజన్లు మండిపడ్దారు. మాల్దీవులను బహిష్కరించాలని, లక్షద్వీప్‌ను హాలిడే డెస్టినేషన్‌గా ప్రచారం చేస్తామని శపథం చేశారు. ఏడాది తర్వాత పర్యాటకుల సంఖ్యను తనిఖీ చేసి చూడండి, మాల్దీవులకు మించి పర్యాటకులు లక్షద్వీప్‌కు రావడం చూస్తారు. భారత పర్యాటకుల సత్తా ఏంటో మాల్దీవులకు చూపిస్తామని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. 

 

 

మరో యూజర్ కూడా రమీజ్ జాత్యాహంకార వ్యాఖ్యను ఖండించారు. మోడీ లక్షద్వీప్ పర్యటతనో మాల్దీవులను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందనే భయంతో ఆ దేశ అధికారి ఇలా అన్నాడంటూ మండిపడ్డారు. భారతీయులారా.. అర్హత లేని వారిపై డబ్బును ఖర్చు చేయడం మానేయండి అంటూ ఆ యూజర్ హితవు పలికారు. భారతీయులను అవమానించిన జాహిద్ రమీజ్.. ఇటీవల భారత పౌరసత్వాన్ని ఎలా కోరుకున్నారో మరో వినియోగదారుడు ప్రస్తావించాడు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలు.. ద్వేషాన్ని వ్యాప్తి చేసే జాహిద్‌ లాంటి వ్యక్తులకు భారత పౌరసత్వాన్ని అందకుండా చూడాలని ఆ యూజర్ కోరాడు. 

 

 

జాహిద్ రమీజ్ పోస్ట్‌కు రుజువుగా.. జూన్ 28, 2023న మాల్దీవులలోని భారత హైకమీషన్‌ను ట్యాగ్ చేసి .. తనకు భారత పౌరసత్వం మంజూరు చేయవలసిందిగా  కోరిన పోస్ట్‌ను ఆ యూజర్ పోస్ట్ చేశాడు. 

 

 

అయితే భారతీయులపై జాహిద్ రమీజ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలకు గాను నెటిజన్లు మండిపడటంతో అతను పశ్చాత్తాపం పడకపోగా ఈ చర్యలను మరింత ద్వేషించాడు. ముస్లిం కార్డ్‌ను ఉపయోగించి.. ‘‘ తాను భారతదేశంలో పుట్టానని, తాను చట్టసభ సభ్యుడిని కూడా కానని కేవలం ట్వీట్లతో నా ఆలోచనను పంచుకుంటానని మీ ప్రజలు మాల్దీవుల గురించి, ముస్లింలు.. పాలస్తీనా గురించి బాధాకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రతిస్పందన అనేది గందరగోళంగా వుంటుందని ’’ పోస్ట్ చేశాడు. 

 

 

ఈ ఘటనతో ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే లక్షద్వీప్‌లో పర్యాటక ప్రదేశాలు, ఇతరత్రా సమాచారం కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ ఫోటోల్లో పగడపు దిబ్బలు, ఇతర సముద్ర జీవులకు సంబంధించిన రెండు నీటి అడుగు భాగానికి చెందిన ఛాయాచిత్రాలను కూడా మోడీ పంచుకున్నారు. ‘‘ ఈ ప్రకృతి సౌందర్యంతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత మంత్రముగ్ధులను చేస్తుందని.. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఆలోచించడానికి ఇది నాకు అవకాశం ఇచ్చింది. తెల్లవారుజామున సమృద్ధమైన బీచ్‌ల వెంట నడిచానని, ఇది స్వచ్ఛమైన ఆనంద క్షణాలని మోడీ పేర్కొన్నారు. 

 

 

ప్రధాని మోడీ ఆ ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత లక్షద్వీప్ , స్నార్కెలింగ్ అనే పదాల కోసం శోధించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్నార్కెలింగ్ అనే పదం కోసం గూగుల్‌లో 2000 శాతం, లక్షద్వీప్ కోసం 350 శాతం సెర్చ్‌లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోడీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

కాగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం) అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అభ్యర్ధి డాక్టర్ మొహమ్మద్ మయిజ్జూ .. మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ) అభ్యర్ధి ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్‌ను ఓడించిన కొత్త అధ్యక్షుడిగా విజయం సాధించారు. అయితే మయిజ్జూ చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డాడు. వాస్తవానికి గతేడాది నవంబర్‌లో డాక్టర్ ముయిజ్జూ .. భారత్ తన సైనిక బలగాలను మాల్దీవుల నుంచి ఉపసంహరించుకోవాలని కోరారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు మాల్దీవులకు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును అధికారికంగా ఈ అభ్యర్ధన చేసినట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఈ పరిణామంపై భారత అధికారులు స్పందిస్తూ.. రెండు దేశాలు దీనికి పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాయని చెప్పారు. మాల్దీవుల నుంచి విదేశీ సైనిక బలగాలను బహిష్కరిస్తానని కొత్త అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత భారత్ తన బలగాలను ఉపసంహరించింది. మాల్దీవులపై ఆధిపత్యం కోసం భారత్, చైనా పోటీపడుతున్నాయి. గత ప్రభుత్వం భారత్‌కు పూర్తి స్థాయిలో సహకరించగా.. ముయిజ్జూ మాత్రం చైనాకు సాగిలపడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios