Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్, గుజరాత్‌లలో ఆప్ ఫ్లాప్ షో?.. ఎగ్జిట్ పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే..

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లాప్ షో ఇచ్చిందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

majority exit poll Predicts AAP Poor performance in gujarat and himachal pradesh
Author
First Published Dec 5, 2022, 8:10 PM IST

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు బీజేపీ వైపు చూశారని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య క్లోజ్ ఫైట్ ఉన్నప్పటికీ.. కాషాయ పార్టీ మెజారిటీ మార్కును అందుకుంటుందని వెల్లడిస్తున్నాయి. మరోవైపు గుజరాత్‌లో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నాయి. 

అయితే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లాప్ షో ఇచ్చిందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ  భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్.. గుజరాత్‌, హిమాచల్‌లో కూడా సత్తా చాటాలని భావించింది. ముఖ్యంగా.. గుజరాత్‌పై ఆప్ ఎక్కువగా  దృష్టి సారించింది. ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. అయితే ఓటర్లను ఆకట్టుకోవడంలో మాత్రం.. ఆమ్ ఆద్మీ పార్టీ సఫలం కాలేదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ పూర్తి స్థాయిలో బరిలో నిలవడం ఇదే తొలిసారి. 

అయితే గుజరాత్‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పరిశీలించినప్పుడు.. కాంగ్రెస్ ఓటర్లు కొంతమేర ఆప్ వైపు మళ్లినట్టుగా స్పష్టం అవుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. అప్పుడే అధికారిక ఫలితాలు ఏమిటనేది తెలుస్తోంది. ఏ పార్టీ ఎంత ఓటు షేర్ సాధించింది, ఎన్ని సీట్లు గెలుపొందిందనే విషయాలు తెలువనున్నాయి. 

హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు.. 
జన్ కీ బాత్- బీజేపీ (32-40), కాంగ్రెస్ (27-34), ఆప్ (0)
రిపబ్లిక్ టీవీ- పీ మార్క్- బీజేపీ (34-39), కాంగ్రెస్ (28-33), ఆప్ (0-1)
టైమ్స్ నౌ-ఈటీజీ- బీజేపీ (34-42), కాంగ్రెస్ (24-32), ఆప్ (0)
జీ న్యూస్- బార్క్- బీజేపీ (35-40), కాంగ్రెస్ (20-25), ఆప్ (0-3)
ఇండియా టూడే- యాక్సిస్ మై ఇండియా- బీజేపీ (24-34), కాంగ్రెస్ (30-40), ఆప్ (0)

గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు.. 
న్యూస్ ఎక్స్- జన్‌ కీ బాత్- బీజేపీ (117-140), కాంగ్రెస్ (34-51), ఆప్ (6-13)
టీవీ9 గుజరాతీ- బీజేపీ (125-130), కాంగ్రెస్ (40-50), ఆప్ (3-5)
రిపబ్లిక్ టీవీ- పీ మార్క్- బీజేపీ (125-148), కాంగ్రెస్ (30-42), ఆప్ (2-10)
ఇండియా టూడే- యాక్సిస్ మై ఇండియా- బీజేపీ (129-151), కాంగ్రెస్ (16-30), ఆప్ (9-21)
 

Follow Us:
Download App:
  • android
  • ios