జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రకుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూ బస్టాండ్‌లో 7 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా ఉగ్రదాడికి నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పేలుడుకు కుట్ర చేసినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర మంత్రులు రాజ్‌‌నాథ్ సింగ్, అమిత్ షా నివాళులు అర్పించారు. 2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌‌పై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే.

పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని బస్సును ఢీకొట్టాడు.  ఈ ఘటనలో 40 మంది సీఆర్‌‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు.