కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 26 మంది గాయపడ్డారు. బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బెంగుళూరు: Karnataka రాష్ట్రంలో మంగళవారం నాడు జరిగిన Road Accident లో ఏడుగురు మరణించారు. మరో 26 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకలోని Hubballi శివారులో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు ఘటన స్థలంలోనే మరణించారు. ప్రయాణీకులతో బస్సు కొల్హాపూర్ నుండి బెంగుళూరు వెళ్తుంది.ఈ సమయంలో అర్ధరాత్రి ధర్వాడ్ వైపు వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టాడని పోలీసులు చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహార్ లో ఇదే తరహాలో ప్రమాదం చోటు చేసుకుంది. గులాయోతి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
ఈ నెల 21న కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో 21 మందితో కూడిన వాహనం బెంకనకట్టికి వెళ్తోంది. అయితే జిల్లాలోని నిగడి వద్ద వాహనం వెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా మనసూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. వీరంతా వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అనన్య(14), హరీష్(13), మహేశ్వర్(11), శిల్ప(34), నీలవ్వ(60), మధుశ్రీ(20), శంభులింగయ్య(35)గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ నెల 22న ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని జోగియా కొత్వాల్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28 నెంబర్ జాతీయ రహదారి పై ఆగివున్న లారీని ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌యూవీ వాహనంలో 11 మంది ఉన్నారు. వారంతా వివాహా వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
also read:వరంగల్‌లో రోడ్డు ప్రమాదం: ఫ్లైఓవర్ నుండి కిందపడ్డ కారు, ఇద్దరు మృతి
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఇక, ఎస్‌యూవీ వాహనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది.
