Asianet News TeluguAsianet News Telugu

వరంగల్‌లో రోడ్డు ప్రమాదం: ఫ్లైఓవర్ నుండి కిందపడ్డ కారు, ఇద్దరు మృతి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
 

Two killed  In Road Accident In Warangal District
Author
Warangal, First Published May 22, 2022, 9:31 AM IST

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. Warangal  ఉరుసు గట్టు వద్ద ఖమ్మం బైపాస్ Hunter  రోడ్డు Fly overపై  నుండి కారు కింద పడింది.,  ఈ ఘటనలో Carలో ఉన్న ఇద్దరు మరణించారు. కారులో ప్రయాణీస్తున్న మరణించినవారిని దంపతులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

బొల్లికుంటలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మరో వైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  వర్ధన్పపేట బొల్లికుంటలో  ఆటోను గుర్తు తెలియని వాహానం ఢీకొట్టడంతో మరో ముగ్గురు మరణించారు. రంగల్ జిల్లా బొల్లికుంట వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.

ఈ నెల 18న వరంగల్ జిల్లా చిలుకమ్మ నగర్ శివారు పర్సతంగా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. చెరువు కట్టపై వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పెళ్లి పనులకు సామాను తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  సంఘటన స్థలంలోనే గగులోతు స్వామి, సీత, జాటోతు బిచ్చమ్మ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతమ్మ, గోవింద్ చనిపోయారు.

also read:మ‌హారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. పెట్రోల్ ట్యాంక‌ర్, ట్ర‌క్కు ఢీ.. 9 మంది స‌జీవ ద‌హ‌నం..

ఈ నెల 5వ తేదీన ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం మండలం ఇచర్ల వద్ద అర్ధరాత్రి సమయంలో ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెంచారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో అన్నారం షరీఫ్‌ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరో వైపు  కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 21న ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్ కు తరలించారు. పోలీసుల కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు

 కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో 21 మందితో వాహనం బెంకనకట్టికి వెళ్తోంది. అయితే జిల్లాలోని నిగడి ప్రాంతానికి చేరుకునే సరికి ఆ వాహ‌నం వెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్క‌డికక్క‌డే చనిపోయారు. మ‌రో 10 మంది గాయాపడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా మనసూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారు. . వీరంతా వివాహ కార్య‌క్ర‌మానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అనన్య(14), హరీష్(13), మహేశ్వర్(11), శిల్ప(34), నీలవ్వ(60), మధుశ్రీ(20), శంభులింగయ్య(35)గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios