తన తోటి మహిళా అధికారిని రూమ్ కి పిలిచి.. అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఆర్మీ మేజర్. కాగా.. ఆ మేజర్ ని ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. ఈ సంఘటన అస్సాంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల క్రితం.. ఆర్మీ మేజర్ జనరల్ ఎంఎస్ జస్వాల్ అస్సాం రైఫిల్స్ లో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేశారు.  కాగా.. ఆ సమయంలో తన దగ్గర పనిచేసే కెప్టెన్ ర్యాంకు మహిళా అధికారిని రూమ్ కి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.

దీనిపై బాధిత మహిళ ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో జైస్వాల్ దోషి అని తేలడంతో.. సోమవారం మేజర్‌ జనరల్‌ ఎంఎస్‌ జస్వాల్‌ను ఆర్మీ జనరల్‌ కోర్టు మార్షల్‌ (జీసీఎం) సర్వీసు నుంచి డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అయితే.. సైన్యంలో వర్గ పోరుకు తనను బలిపశువు చేశారని, తాను అమాయకుడినని ఆర్మీ మేజర్ జస్వాల్ తెలిపారు. కావాలనే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను కోర్టును ఆశ్రయిస్తానని జస్వాల్ తెలపడం గమనార్హం.