సూరత్: సూరత్‌లో  ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 14 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు వ్యాపించి ప్రమాదం చోటు చేసుకొంది.

ఈ ప్రమాదంలో చిక్కుకొన్న విద్యార్థులను రక్షించేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.  ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.శుక్రవారం నాడు మధ్యాహ్నం కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు క్లాసులు వింటున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భవనం టెర్రస్ పై నుండి పలువురు దూకారు.

ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. అగ్ని కీలకలను అదుపులోకి తెచ్చేందుకు 18 ఫైరింజన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అగ్ని ప్రమాదానికి  గల కారణాలు ఏమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఈ భవనంలో ఇంకా విద్యార్థులు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవనంలో చిక్కుకొన్న వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.