Asianet News TeluguAsianet News Telugu

రైలు పట్టాలపై పరుగులు పెట్టిన మహీంద్రా బొలెరో.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్.. అసలు దీని కథ ఏంటంటే ?

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఉన్న పట్టాలపై మహీంద్రా బొలెరో రైలు పరుగు తీసింది. దీనిని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. 

Mahindra Bolero ran on the train tracks.. Video is going viral on social media..ISR
Author
First Published Mar 28, 2023, 4:26 PM IST

మహీంద్రా బొలెరో రైలు పట్టాలెక్కింది. రోడ్డుపై ప్రయాణించాల్సిన వాహనం.. రైలు పట్టాలపై సునాయసంగా పరిగెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ? ఎందుకు బొలెరోను పట్టాలపై నడిపించారని అనుకుంటున్నారా ? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

లోయలోపడిన బస్సు.. 62 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు.. దర్శనం చేసుకుని వస్తుండగా కేరళలో ప్రమాదం (వీడియో)

జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ఈ బ్రిడ్జిని ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. అందులో భాగంగానే రైలు పట్టాలపై నడిచేందుకు ఓ మహేంద్ర బొలెరో వాహనాన్ని మోడిఫై చేశారు. రైలు పట్టాలపై నడిచేందుకు అనుకూలంగా తీర్చిదిద్దారు. దానిని పట్టాలపై ఎక్కించి పరుగులు పెట్టించారు. దీనిని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసి మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. 

మనీలాండరింగ్ కేసులు పెరుగుతున్న‌య్.. గ‌త ఐదేండ్ల‌లో 3,497 కేసులు న‌మోదు : ప్ర‌భుత్వం

ఈ వీడియోను రాజేందర్ బి అక్లేకర్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. దీనికి అనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్ ను రీట్వీట్ చేశారు. అందులో బొలెరో సామర్థ్యం కొత్త ఎత్తులకు చేరుతోందని అన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మహీంద్రా వ్యవస్థాపకులు రహదారి లేని చోటికి వెళ్లేలా వాటిని తయారు చేశారు’’ అని అన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ వీటిని ఎప్పటికీ తన వద్దనే భద్రపర్చుకుంటానని పేర్కొన్నారు. 

కాగా.. ఈ వీడియోలో ఉన్న బ్రిడ్జిపై పలువురు సోషల్ మీడియా యూజర్లు భిన్నంగా స్పందించారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఒకే ట్రాక్ ఎందుకు నిర్మించారని ఓ యూజర్ ప్రశ్నించారు. ‘‘ ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసిన తరువాత మేం సింగిల్ లైన్ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాము’’ అని కృష్ణ పోఫాలే అనే యూజర్ వ్యాఖ్యానించారు.

పాన్- ఆధార్ లింక్ గడువును మ‌రోసారి పొడిగించిన ప్ర‌భుత్వం

ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జికి ‘చీనాబ్ బ్రిడ్జి’ అని పేరు పెట్టారు. ఇది చీనాబ్ నది నీటి మట్టం కంటే 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వంతెన  మొత్తం పొడవు 1315 మీటర్లు. గతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ లోని బెపాన్ జియాంగ్ నదిపై నిర్మించిన బ్రిడ్జికి పేరుంది. ఇది నీటి మట్టానికి 275 మీటర్ల ఎత్తులో ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios