Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri: 24 గంటలపాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన ప్రభుత్వం.. వివరాలివే

ఉత్తరప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను నిరసిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ ఈ రోజు అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సమయంలో అత్యవసర సేవలను మినహాయించింది.

maharastra government announce bandh in protest of lakhimpur kheri incident
Author
Mumbai, First Published Oct 10, 2021, 8:08 PM IST

ముంబయి: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశాన్ని కదిలించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కారు సహా ఇతర వాహనాలు farmers ఆందోళనకారులపై దూసుకెళ్లాయి. ఇందులో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు సహా ప్రతిపక్ష పార్టీలు, వర్కర్స్ యూనియన్లు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వమే బంద్‌కు పిలుపునిచ్చింది.

Lakhimpur Kheri ఘటనను నిరసిస్తూ maharastraలో ఇవాళ అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు bandh పాటించాలని మహావికాస్ అఘాది నిర్ణయం తీసుకుంది. ఆ ఘటనలో రైతుల మరణాలపై మంత్రిమండలి విషాదాన్ని వ్యక్తపరిచిందని, రాష్ట్ర బంద్ పాటించాలని తీర్మానించిందని సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌ను పాటించాలని కోరింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తున్నదని, దీన్ని కచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని తెలిపింది. బీజేపీ నేత కొడుకు రైతులపై నుంచి వాహనాలు తీసుకెళ్లాడని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ ట్వీట్ చేస్తూ బంద్‌ను ప్రకటించారు.

Also Read: Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్

ఈ 24 గంటల బంద్ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తెలిపింది. మెడికల్ స్టోర్లు, పాల సరఫరా, హాస్పిటళ్లు, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం ఉండబోదని వివరించింది. ఇతర మార్కెట్లు బంద్ ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే పూణె అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ, ఛత్రపతి శివాజీ మార్కెట్ యార్డ్ ట్రేడర్లూ తాము బంద్‌లో పాల్గొంటున్నామని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios