ఇండియాపై కరోనా దెబ్బ: మొత్తం కేసులు 23,077కి చేరిక, 718 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077కి చేరుకొన్నాయి. ఈ వైరస్ సోకి ఇప్పటికి దేశంలో 718 మంది మృత్యువాతపడ్డారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077కి చేరుకొన్నాయి. ఈ వైరస్ సోకి ఇప్పటికి దేశంలో 718 మంది మృత్యువాతపడ్డారు.
గత 24 గంటల్లో 1684 కేసులు నమోదయ్యాయి. 37 మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ సోకినవారిలో 4,748 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6,430 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.వీరిలో 640 మంది కరోనా నుండి కోలుకొన్నారు. 283 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలుపుతోంది.
ఢిల్లీలో 2,376 కేసులు నమోదయ్యాయి.వీరిలో 808 రోగులు రికవరీ అయ్యారు. 50 మంది మరణించారు. గుజరాత్ లో 2,624 కేసులు నమోదయ్యాయి. వీరిలో 258 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 112 మంది మృతి చెందారు.
also read:పోలీస్ నుండి మహరాష్ట్ర మంత్రి జితేంద్రకి సోకిన కరోనా: క్వారంటైన్‌కు తరలింపు
తమిళనాడులో 1,683 కేసులు నమోదు కాగా, 752 రోగులు రికవరీ కాగా, 20 మంది చనిపోయారు. రాజస్థాన్ లో 1,964 కేసులు నమోదయ్యాయి. వీరిలో 230 మంది రికవరీ అయ్యారు. 27 మంది మృతి చెందారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1,699 కేసులు నమోదయ్యాయి. వీరిలో 203 మంది నయమై ఇంటికి చేరుకొన్నారు. 83 మంది చనిపోయారు.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 1,510 కేసులు నమోదు కాగా, 206 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు. దేశంలో తొలి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 447 మంది మాత్రమే కరోనా సోకిన రోగులున్నారు.
కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించాయి. మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను మే 5 తర్వాతి వరకు కూడ పొడిగించాయి.కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహ పరిశ్రమలను ఆదుకొనేందుకు చర్యలు తీసుకొంది.ఇంతకుముందు ప్రకటించిన కరోనా ప్యాకేజీపై చర్చించేందుకు ప్రధాని మోడీతో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు భేటీ కానున్నారు.