పోలీస్ నుండి మహరాష్ట్ర మంత్రి జితేంద్రకి సోకిన కరోనా: క్వారంటైన్‌కు తరలింపు
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కూడ కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు కూడ ధృవీకరించారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కూడ కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు కూడ ధృవీకరించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జితేంద్ర పనిచేస్తున్నారు. మంత్రి నివాసంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో మంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులు రెండు వారాల పాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అనంతరం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా లేదని తేలింది.దీంతో ఆయనతో పాటు కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు.
తన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి జితేంద్ర ఇటీవల ఓ పోలీస్ అధికారితో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన వారం రోజుల తర్వాత పోలీస్ అధికారికి కరోనా సోకిందని తేలింది. ఈ విషయం తెలిసిన మంత్రి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నారు. మంత్రికి కూడ కరోనా సోకిందని వైద్యులు గుర్తించారు.
also read:కరోనా వైరస్: ముంబైలో 'మహా' జంప్, మహారాష్ట్రలో 6 వేలు దాటిన కేసులు
మంత్రితో పాటు మంత్రి కుటుంబసభ్యులను ఆయనతో సన్నిహితంగా ఉన్నవారిని కూడ క్వారంటైన్ కు తరలించారు. జితేంద్రతో పాటు ఆయన సమీప బంధువులకు కూడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మంత్రితో భేటీ అయిన సీనియర్ పోలీస్ అధికారికి మర్కజ్ కు వెళ్లిన వారిని గుర్తించడంతో కీలకంగా వ్యవహరించారు. దీంతో అతనికి వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.