మహిళా వెయిట్ లిప్టర్ సూసైడ్...నీటికుంటలో దూకి...

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 30, Aug 2018, 12:15 PM IST
Maharashtra woman weightlifter commits suicide
Highlights

మహారాష్ట్ర లో ఓ మహిళా క్రీడాకారిణి దారుణానికి పాల్పడింది.  19 ఏళ్ల యువ వెయిట్ లిప్టర్ ఓ నీటికుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన రాయగడ్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోని గోరేగావ్ జిల్లాలో చోటుచేసుకుంది.
 

మహారాష్ట్ర లో ఓ మహిళా క్రీడాకారిణి దారుణానికి పాల్పడింది.  19 ఏళ్ల యువ వెయిట్ లిప్టర్ ఓ నీటికుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన రాయగడ్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోని గోరేగావ్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వైభవి పాటేకర్ అనే 19 ఏళ్ల మహిళా యువ వెయిట్ లిప్టర్ జాతీయ స్ధాయి క్రీడాకారిణి. ఈమె జాతీయ స్థాయి వెయిట్ లిప్టింగ్ లో సిల్వర్  మెడల్, రాష్ట్ర స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది.

అయితే ఈమె రెండు రోజుల క్రితం తన ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి వెతగ్గా ఓ నీటికుంటలో శవంగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఈమె ఆత్మహత్యకు చేసుకోడానికి గల కారణాలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మెసేజ్ ద్వారా తెలిపింది. తాను వెయిట్ లిప్టింగ్ లో అత్యుత్తమంగా రాణించకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.  
 

loader