మహారాష్ట్రలో 500 అడుగుల లోయలో పడ్డ బస్సు, 32 మంది మృతి

maharashtra road accident
Highlights

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాగా ఎత్తునుండి పడటంతో బస్సులోని 32 మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం.

ట్రావెల్స్ బస్సు ఓ ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి 500 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 32 మంది మృత్యువాతపడగా, మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుండి గాయపడినవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు.వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 
loader