ముంబై: మహారాష్ట్ర రాజకీయా సంక్షోభానికి ముగింపు పలికింది. శివసేనతో కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు సఫలమయ్యాయి. మహారాష్ట్ర సీఎం పీఠం శివసేనకే అప్పగించింది కాంగ్రెస్, ఎన్సీపీలు. శుక్రవారం సాయంత్రం జరిగిన చర్చల్లో ఉద్ధవ్ థాక్రేను సీఎంగా ప్రతిపాదించాయి కాంగ్రెస్, ఎన్సీపీలు. 

దాంతో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికినట్లైంది. ఉద్ధవ్ థాక్రేను సీఎంగా మూడు పార్టీలు అంగీకరించాయని చెప్పుకొచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అప్పగించనున్నట్లు తెలిపారు. 

మహా రాజకీయం: శివసేనకు బీజేపీ ఝలక్, రాజ్యసభలో సీటు మార్పు

ఉద్ధవ్ థాక్రేను సీఎంగా ఎంపిక చేసినట్లు మూడు పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. అంతేకాదు సంతకాలు సైతం చేశాయి. అయితే మూడు పార్టీలు కలిసి శనివారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

maha vikas agadhi: పవార్ మార్కు రాజకీయం... ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశించడంతో కాంగ్రెస్, ఎన్సీపీలు రంగంలోకి దిగాయి. శివసేనతో కలిసేందుకు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూటమి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 

మహారాష్ట్రలో బీజేపీ మరోసారి సీఎం కుర్చీ అధిరోహించకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. ఎన్సీపీతో కలిసి శివసేనకు మద్దతు పలికేలా సోనియా చక్రం తిప్పారు. బీజేపీని సీఎం కుర్చీకి దూరం చేయాలంటే భావజాలం పరంగా సరిపోలని శివసేనతో కలిసేందుకు కూడా వెనకడుగు వేయలేదు సోనియాగాంధీ అని తెలుస్తోంది. 

సోనియాగాంధీ ఆదేశాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలు శివసేన పార్టీతో కలిసి సమావేశం నిర్వహించాయి. శుక్రవారం సాయంత్రం ముంబైలోని నెహ్రూ సెంటర్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అధిష్టించేందుకు మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. 

ఉద్ధవ్ థాక్రే కూటమికి నేతృత్వం వహించేలా, ఐదేళ్లపాటు సీఎం కుర్చీలో ఉండేలా సమావేశంలో సంతకాల సేకరణ సైతం చేశారు. ఉద్ధవ్ సీఎంగా ఉండాలని కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపాదించాయి. అందుకు శివసేన సైతం అంగీకరించడంతో మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడింది. 

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదరడంతో మహారాష్ట్రలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు ముగింపు పలికే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో తొలిసారిగా సయోధ్యకు అంగీకారం తెలిపింది. ఇప్పటి వరకు బీజేపీతో శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే ఎన్నికలకు సైతం వెళ్లింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 50:50 ఫార్ములాను ప్రతిపాదించింది. అందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఆ పార్టీల మధ్య స్నేహం చెడింది.