దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఏకంగా 12 మంది మృతి.. 23 మందికి తీవ్ర గాయాలు..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 12 మంది చనిపోగా.. మరో 23 మంది గాయపడ్డారు. ఛత్రపరి శంబాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రపతి సంభాజీనగర్‌లోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మినీ బస్సు, కంటైనర్‌ను ఢీకొన్నాయి. దీంతో 12 మంది మృతి చెందగా, 23 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఓ మైనర్ బాలికతో సహా ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
సమాచారం ప్రకారం.. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలోని వైజాపూర్ ప్రాంతంలో శనివారం-ఆదివారం మధ్య రాత్రి 12:30 గంటలకు ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. రోడ్డుపై నిలిపి ఉన్న కంటైనర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో 35 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాణికులు సమాచారం ప్రకారం.. నాసిక్ నుండి కొంతమంది భక్తులు బుల్దానా జిల్లాలోని బాబా దర్గాను సందర్శించడానికి వెళ్లారు. దర్శనానంతరం అందరూ నాసిక్ వైపు తిరిగి వెళ్తున్నారు. అప్పుడు ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్ అని పిలుస్తారు) జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది నాసిక్ జిల్లాలోని పథార్డి , ఇందిరా నగర్ నివాసితులున్నారు.
గత మూడు నెలల్లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఇది రెండో అతిపెద్ద రోడ్డు ప్రమాదం. జూలై నెలలో నాగ్‌పూర్ నుండి పూణే వెళ్తున్న బస్సు పిల్లర్‌ని ఢీకొని డివైడర్‌పైకి ఎక్కి బోల్తా కొట్టిన కారణంగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 33 మందిలో 25 మంది కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బస్సులో టైరు పగిలి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బస్సులోని డీజిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించాయి.