తనను ప్రేమించడం లేదనే అక్కసుతో... ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మహిళా లెక్చరర్ పై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమె ఒంటిపై మంటలు ఆర్పించి ఆస్పత్రికి తరలించారు. కాగా... ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహరాష్ట్రకు చెందిన  దరోడా గ్రామానికి చెందిన వికేశ్ నాగ్రేల్, అంకిత ఇద్దరు స్నేహితులు. వికేష్ కు  పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. అయినప్పటికీ కాలేజీ లెచ్చరర్ గా పనిచేస్తున్న అంకితను లైంగికంగా వేధించేవాడు.  ఆందోళనకు గురైన అంకిత తన స్నేహితుడైన వికేష్ ను  దూరం పెట్టింది.

Also Read మహారాష్ట్ర: పెళ్లికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, పది మంది మృతి...

దీంతో నిందితుడు తన స్నేహితురాలపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో  బాధితురాలు ఎప్పటిలాగా  తన ఇంటి నుంచి 75కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి బస్సులో బయలుదేరింది. ఉదయం 7:15 గంటల ప్రాంతంలో హింగ్రాన్ గాట్ లోని ఓ బస్టాప్ నుంచి కాలేజీకి నడుచుకుంటూ వెళుతుండగా మార్గం మధ్యలో అడ్డగించిన వికేష్..తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను బాధితురాలిపై చల్లి నిప్పంటించాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు.  దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకిత 40శాతం కాలిన గాయాలతో  ఊపిరి పీల్చుకునేందుకు  ఇబ్బంది పడుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.