మహారాష్ట్రలో ఓ వ్యక్తి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.పాల్‌గడ్‌లో నిన్న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

ముంబయి: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్‌గడ్ జిల్లాలో ఓ వ్యక్తి జిమ్‌లో వర్కవుట్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. వాసాయ్ టౌన్‌లో నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వివరించారు.

ప్రహ్లాద్ నికమ్ అనే వ్యక్తి రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తుండేవాడు. అదే విధంగా నిన్న కూడా ఆయన అతను జిమ్‌కు వెళ్లాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆయన వర్కవుట్ చేశాడు. వర్కవుట్ చేస్తున్నప్పుడే ఒంట్లో కొంత ఆయనకు నలతగా అనిపించినట్టు తెలిసింది. అలసిపోయినట్టు ప్రవర్తించాడు. కానీ, అలాగే వర్కవుట్ కొనసాగించాడు. అదే సమయంలో ఉన్నట్టుండి ప్రహ్లాద్ నికమ్ కుప్పకూలిపోయాడు. 

ప్రహ్లాద్ నికమ్‌ను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు వివరించారు. కానీ, అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. 

Also Read: ఘజియాబాద్ జిమ్ ట్రైనర్‌కు హార్ట్ ఎటాక్.. కుర్చీలో కూర్చునే మరణం

ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్టు ఆ అధికారి తెలిపారు.